కాంట్రాక్టింగ్ వ్యవస్థకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి 

కాంట్రాక్టింగ్ వ్యవస్థకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి 

* ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఏర్పాటు వద్దు 
* ఔట్సోర్సింగ్ పేరుతో వసూళ్ల దందాలు 
* అన్యాయం అయిపోతున్న నిరుద్యోగ యువత 
* ప్రభుత్వమే నేరుగా రిక్రూట్మెంట్ నిర్వహించాలి 
* ఆర్పిఐ అత్తవాళ్లే  పార్టీ జిల్లా అధ్యక్షులు కోట శివశంకర్
* కేంద్ర మంత్రి రామదాస్ అత్తవాళ్లే కి వినతి పత్రం

నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ డైలీ వేజ్ కార్మికులకు ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు క్యాటరింగ్ కార్మికులకు ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దుచేసి తెలంగాణ ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్పిఐ అత్తవాళ్లే పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కోట శివశంకర్ బుధవారం ఢిల్లీలోని  కేంద్ర సామాజిక న్యాయం సాధికారికత శాఖ మంత్రి రామదాస్ అత్తవాళ్లే కి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువకులు పేద ప్రజలు చదువుకున్న పేద విద్యార్థులు ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సరైన ఉద్యోగ అవకాశాలు నోటిఫికేషన్లు లేక ఇబ్బందులు పడుతున్నారని కోట శివశంకర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వ్యవస్థలలో ఔట్సోర్సింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం వలన చిన్నచిన్న ఉద్యోగాలకు కూడా ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నోటిఫికేషన్లు ఇవ్వడం వలన ఔట్సోర్సింగ్ ఏజెన్సీ యాజమాన్యాలు దందాలకు  అక్రమ వసూళ్లకు  పాల్పడుతున్నారని తెలిపారు.  చిన్న అటెండర్ ఉద్యోగం నుంచి కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం వరకు స్కావెంజర్ స్లీపర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర ఉద్యోగాలకు కూడా మూడు నుంచి ఐదు లక్షల రూపాయల లంచం తీసుకొని ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని కలెక్టర్లు కూడా ఏమి చేయలేని పరిస్థితిని ఉందన్నారు. తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్లకు మంత్రులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని ఆఖరికి ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను గత కెసిఆర్ ప్రభుత్వంలో మంత్రులు బినామీలుగా ఉండి నడిపించడం జరిగిందని ఈ ఔట్సోర్సింగ్ వ్యవస్థని ప్రశ్నిస్తే మాపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని తప్పుడు రిపోర్ట్లు కలెక్టర్లు జిల్లా అధికారులు నేషనల్ ఎస్సీ కమిషన్ కి నేషనల్ ఎస్టీ కమిషన్ కి పంపుతున్నారని చెప్పారు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థలకు ప్రభుత్వం నుంచి ప్రతినెల జీతాలు మంజూరు చేసిన కమిషన్లకి కక్కుర్తి పడి నెలల తరబడి ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని తెలిపారు. ప్రభుత్వం చెల్లించే జీఎస్టీ ఈఎస్ఐ పిఎఫ్ సరియైన సమయంలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీ యాజమాన్యాలే ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోయినా ముందుగా ఔట్సోర్సింగ్ యాజమాన్యాల కార్మికుల ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తుల ఈఎస్ఐ పిఎఫ్ లు రెగ్యులర్గా కట్టాలని అలా కట్టకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఎవరైనా కాంట్రాక్ట్ కార్మికులు డైలీ వేజ్ కార్మికులు ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎవరైనా చనిపోతే కనీసం వారికి పిఎఫ్ కూడా పెన్షన్ కూడా వారి కుటుంబాలకు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థ అంతా అంతం చేయాలంటే ఈ అవినీతి వ్యవస్థను రూపుమాపాలంటే కేంద్ర ప్రభుత్వమే నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు కాంట్రాక్ట్ కార్మికులకు డైలీ వెజ్ కార్మికులకు క్యాటరింగ్ కార్మికులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో కేంద్రమంత్రి సామాజిక సాధికారికత శాఖ మంత్రి ఆర్.పి.ఐ పార్టీ జాతీయ అధ్యక్షులు రాందాస్ అత్తవాళ్లేకి వినతి పత్రం అందించి సమస్యను పరిష్కరించాలని కోరడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని వివరించారు. అదేవిధంగా కొత్తగూడెంలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించడానికి కొత్తగూడెంకి రావాలని ఆర్.పి.ఐ జిల్లా పార్టీ పార్టీ ఆఫీసు ఓపెన్ చేయడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఈ అంశాలపై చర్చించడానికి కొత్తగూడెం కేంద్రంగా అన్ని డిపార్ట్మెంట్ల ప్రిన్సిపల్ సెక్రటరీలతో మీటింగ్ నిర్వహించడానికి ముఖ్యఅతిథిగా రావాలని ఆహ్వానం పలకడం జరిగిందన్నారు. మంత్రి సమస్యలన్నీ విని కచ్చితంగా పరిష్కరిస్తానని కొత్తగూడెంకి వస్తానని హామీ ఇవ్వడం జరిగిందని కోట శివ శంకర్ తెలిపారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇదేం ఆట..! పెవిలియన్‌కు క్యూ కట్టిన సన్‌రైజర్స్‌ బ్యాటర్లు.. అసహనం వ్యక్తం చేసిన కావ్య మారన్‌..! ఇదేం ఆట..! పెవిలియన్‌కు క్యూ కట్టిన సన్‌రైజర్స్‌ బ్యాటర్లు.. అసహనం వ్యక్తం చేసిన కావ్య మారన్‌..!
ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం సొంత మైదానంలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లోనూ బ్యాట్స్‌మెన్‌ మరోసారి విఫలమయ్యారు. ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ,...
నిరుపేదల ఆత్మగౌరవ పథకమే సన్నబియ్యం : కలెక్టర్ సిక్తా పట్నాయక్
బ్రహ్మోత్సవాలకు మహామ్మాయిదేవి ముస్తాబు
మేడ్చల్‌లో యువతిపై లైంగికదాడికి యత్నించిన దుండగులు
రేవంత్ రెడ్డి వస్తున్నాడని పవన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు?
నేతకాని మహర్ రాష్ట్రస్థాయి సదస్సుకు మాల మహానాడు మద్దతు
మోదీని క‌లిసిన శ్రీలంక మాజీ క్రికెట‌ర్లు.. జ‌య‌సూర్య విజ్ఞ‌ప్తికి స్పందించిన ప్ర‌ధాని