ప్రభుత్వ సంక్షేమ పథకాలను గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగపరచుకోవాలి

ఐటీడీఏ పిఓ,బి. రాహుల్

ప్రభుత్వ సంక్షేమ పథకాలను గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగపరచుకోవాలి

నమస్తే భారత్: భద్రాచలం : ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకొని  స్వస్శక్తితో కుటీర పరిశ్రమ నెలకొల్పుకొని వారి కుటుంబాన్ని పోషించుకోవడమే కాక పదిమందికి ఉపాధి కల్పించడం సంతోషకరమని, అలాగే మార్కెట్ పరంగా వెసులుబాటు కల్పించుకొని ఆర్థికంగా లాభాల బాటలో నడవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.  శనివారం నాడు భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని శ్రీ జయ దుర్గ సహిత పంచముఖ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా నెలకొల్పిన శ్రీ దుర్గా భవాని సెంట్రింగ్ యూనిట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులైన గిరిజన యువతి, యువకులు 15 లక్షల సబ్సిడీతో 25 లక్షల ఖర్చుతో నిర్మాణం చేపట్టిన శ్రీ దుర్గా భవాని సెంట్రింగ్ బ్రిక్స్ యూనిట్ను గిరిజన యువతి యువకులు అందరూ కలిసికట్టుగా ఉండి చిన్న తరహా పరిశ్రమ నెలకొల్పుకొని జీవనోపాధి పెంపొందించుకోవడం చాలా అభినందించదగ్గ విషయమని అన్నారు. యూనిట్ కాస్ట్ మరియు ఇటుకల తయారీ మరియు మార్కెటింగ్ సౌకర్యం గురించి యూనిట్ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొంది జీవనాధారం పెంపొందించుకోవడానికి 25 లక్షల కాస్ట్ తో శ్రీ దుర్గా భవాని సెంట్రింగ్ యూనిట్ నెలకొల్పుకొని, తయారుచేసిన సిమెంట్ ఇటుకలను మార్కెటింగ్ సౌకర్యం కల్పించుకొని అమ్మకాలు జరుపుకొని లబ్ధి పొందాలని అన్నారు. యూనిట్ ఏర్పాటుకు 25 లక్షలు యూనిట్ కాస్ట్ కాగా 15 లక్షలు సబ్సిడీ మరియు 2,50,000 బెనిఫిషర్ కంట్రిబ్యూషన్, బ్యాంకు రుణము 7,50,000 అందించడంతో యూనిట్ ఏర్పాటు చేసుకున్నామని యువతీ యువకులు తెలిపారు . నిరుద్యోగులైన గిరిజన యువతి యువకులు చిన్న తరహా పరిశ్రమలు స్థాపించుకొని ఆర్థికంగా ఎదగాలని, ఇక్కడ తయారు చేస్తున్న ఇటుకలు మార్కెటింగ్ సౌకర్యం కల్పించుకోవడానికి కాంట్రాక్టర్స్ తాపీ మేస్త్రీలతో సత్సంబంధాలు పెట్టుకొని సకాలంలో వారికి ఇటుకలు సరఫరా చేయాలని, దీనికి కావలసిన ముడి సామాన్లు సరసమైన ధరలకు కొనుగోలు చేసి మన్నికైన ఇటుకలు తయారు చేయాలని అన్నారు. అలాగే బ్యాంకు ద్వారా తీసుకున్న రుణము ప్రతినెల సకాలంలో చెల్లిస్తే మరల యూనిట్ నడవడానికి అవసరానికి బ్యాంకు అధికారులు రుణాలు అందించడానికి మక్కువ చూపుతారని అన్నారు. అనంతరం సిమెంట్ ఇటుకలు తయారు చేసే మిషన్ మరియు సామాగ్రి పరిశీలించి, ఇటుకలు రవాణా చేసే వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఏ టి డి ఓ అశోక్ కుమార్,జేడీఎం హరికృష్ణ, యూనిట్ సభ్యులు రాజు, వెంకటమ్మ, మహేశ్వరి, వెంకటమ్మ, నాగరాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నల్లాలకు మోటర్లు బిగిస్తే కనెక్షన్‌ కట్‌.. హైదరాబాద్‌వాసులకు జలమండలి వార్నింగ్‌ నల్లాలకు మోటర్లు బిగిస్తే కనెక్షన్‌ కట్‌.. హైదరాబాద్‌వాసులకు జలమండలి వార్నింగ్‌
హైదరాబాద్‌ నగరంలో జలమండలి సరఫరా చేసే తాగునీటి మీదనే ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది వినియోగదారులు నల్లా కనెక్షన్లకు మోటర్లు బిగించడం ఆనవాయితీగా మారిపోయింది. ఒక ఇల్లు...
63 కోట్ల ఫ్రాడ్‌.. కోఆప‌రేటివ్ బ్యాంక్ మాజీ చైర్మెను అరెస్టు చేసిన ఈడీ
పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించకుంటే ఉద్యమిస్తాం : ధనంజయ
హాట్ ఎయిర్ బెలూన్‌పై నుంచి పడి వ్యక్తి మృతి
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
నేటి నుంచి సిద్దేశ్వర స్వామి జాతర.. వాల్ పోస్టర్‌ ఆవిష్కరణ
బీహార్‌లో పిడుగుపాటుకు 21 మంది మృతి