ఎస్పీ రోహిత్ రాజుకు ప్రశంసా పత్రం
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది ఇతర శాఖల అధికారులను సమన్వయం చేస్తూ గడచిన పార్లమెంటు ఎన్నికలను సజావుగా జరిగేలా కృషిచేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజును సిఆర్పిఎఫ్ ఐజిపి చారుసిన్హా ప్రత్యేకంగా అభినందనలు తెలిపి డీజి డిస్క్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. సోమవారం హైదరాబాదులోని సిఆర్పిఎఫ్ సౌత్ సెక్టార్ కార్యాలయం నందు జరిగిన కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజు ప్రశంస పత్రాన్ని స్వీకరించారు. నిషేధిత మావోయిస్టు ప్రభావిత జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసి సమర్థవంతంగా పార్లమెంట్ ఎన్నికలను పూర్తి చేసినందులకు గాను ఈ గుర్తింపు లభించింది. జిల్లాలో విధులు నిర్వర్తించే పోలీస్ అధికారులు సిబ్బంది సమిష్టి కృషి వల్లనే పార్లమెంట్ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమర్థవంతంగా పూర్తి చేయగలిగామని ఈ సందర్బంగా ఎస్పీ తెలిపారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
