పంట ఎండిన రైతులకు నష్టపరిహారం చెల్లించండి -ఇందిరమ్మ ఇల్లులు అర్హులందరికీ అందించాలి
-సిపిఎం రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు అన్నవరపు కనకయ్య
నమస్తే భారత్: పినపాక : ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయని సిపిఎం రాష్ట్ర సెక్రెటరీ సభ్యులు అన్నవరపు కనకయ్య అన్నారు. శుక్రవారం పిరపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో దడిగల వెంకన్న అధ్యక్షతన మండల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతుబంధు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, రైతు రుణమాఫీ కూడా అందరికీ కాలేదన్నారు. రైతుబంధు అందరికీ అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చెరువుల్లో నీరు లేక చాలా పంటలు ఎండిపోయాయని ఎండిన పంటలకు ప్రభుత్వం సర్వే చేసి నష్టపరిహారం అందించాలని కోరారు. అర్హత గల ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందించాలన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు కొంతమందికి ఇంకా బిల్లులు కాలేదని ఆ బిల్లులు వెంటనే క్లియర్ చేయాలను కోరారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో తునికి ఆకు సేకరణ పనులను చేపట్టాలన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కదో పట్టిస్తుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసంలో రేషన్ కార్డ్ లింకులు తొలగించాలని కోరారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న, సిపిఎం మండల కార్యదర్శి దుబ్బ గోవర్ధన్, మండల కమిటీ సభ్యులు మడివి రమేష్, కల్తి వెంకటేశ్వర్లు , తదితరులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
