సింగరేణి ఉమెన్స్ కాలేజీకి అటాచ్డ్ హాస్టల్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలి

* విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ * కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ కి వినతి పత్రం

సింగరేణి ఉమెన్స్ కాలేజీకి అటాచ్డ్ హాస్టల్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలి

నమస్తే భారత్ /భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కళాశాలకు ఈనెల 30వ తేదీ కల్లా కాలేజీ అటాచ్డ్ హాస్టల్ అనుమతులు మంజూరు చేయాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ గురువారం  కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ రామచంద్రంకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోట శివశంకర్ మాట్లాడుతూ సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ప్రధానంగా నిరుపేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుతున్నారని 15 సంవత్సరాల నుంచి కాలేజీ ఎటాచ్డ్ హాస్టల్ కోసం తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు.  గత సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ గొప్ప మనసుతో కాలేజీ ఎటాచ్డ్ హాస్టల్ కి అనుమతులు మంజూరు చేయడానికి కమిటీ వేస్తే అప్పటి పాత ప్రిన్సిపాల్ పాత హాస్టల్ వార్డెన్ అవినీతి ఎక్కడ బయటపడుతుందని నేపంతో ఆ కమిటీని తొక్కి వేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుత సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం కార్మికుల విద్యార్థుల సంక్షేమం కోసం అనునిత్యం కృషి చేస్తున్నారని చెప్పారు. హాస్టల్ సమస్యపై చైర్మన్ బలరాం కాకతీయ యూనివర్సిటీ రిజిస్టార్ కి నేరుగా ఫోన్ చేసి మాట్లాడటం జరిగిందన్నారు. అదేవిధంగా గత సంవత్సరం కాకతీయ యూనివర్సిటీ నుండి సింగరేణి ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీకి ఎటాచ్డ్ హాస్టల్ కోసం అనుమతుల కోసం కూడా సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ అప్పటి సెక్రటరీ నీకోలాస్ కూడా యూనివర్సిటీ రిజిస్టార్ కి లెటర్ రాయడం జరిగిందని తెలిపారు. ఈ మార్చి 30 కల్లా కాకతీయ యూనివర్సిటీ కాలేజీ ఎటాచ్డ్ హాస్టల్ అనుమతులు మంజూరు చేయడానికి ఒక కమిటీని పంపించి సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి పిల్లలకు ఎటువంటి భోజనం అందుతుంది తదితర విషయాల పైన కమిటీ ఇన్స్పెక్షన్ చేసి కాలేజీ ఎటాచ్డ్ హాస్టల్ మంజూరు చేస్తే కాలేజీ అభివృద్ధి జరుగుతుందన్నారు. సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి యంగ్ అండ్ డైనమిక్ సీనియర్ అధికారి శ్రీధర్ వెంటనే ఈ 12 నెలల స్కాలర్షిప్ హాస్టల్ మెస్ చార్జీలు మంజూరు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నిరుపేద విద్యార్థులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసిలో పేద మహిళ విద్యార్థులకు వెంటనే హాస్టల్ మంజూరు కోసం ఈనెల 28 తేదీన ఒక కమిటీని పంపించి హాస్టల్ అనుమతులు మంజూరు చేయాలని  కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ కి వినతి పత్రం అందించడం జరిగిందని కోట శివశంకర్  పేర్కొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇదేం ఆట..! పెవిలియన్‌కు క్యూ కట్టిన సన్‌రైజర్స్‌ బ్యాటర్లు.. అసహనం వ్యక్తం చేసిన కావ్య మారన్‌..! ఇదేం ఆట..! పెవిలియన్‌కు క్యూ కట్టిన సన్‌రైజర్స్‌ బ్యాటర్లు.. అసహనం వ్యక్తం చేసిన కావ్య మారన్‌..!
ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం సొంత మైదానంలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లోనూ బ్యాట్స్‌మెన్‌ మరోసారి విఫలమయ్యారు. ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ,...
నిరుపేదల ఆత్మగౌరవ పథకమే సన్నబియ్యం : కలెక్టర్ సిక్తా పట్నాయక్
బ్రహ్మోత్సవాలకు మహామ్మాయిదేవి ముస్తాబు
మేడ్చల్‌లో యువతిపై లైంగికదాడికి యత్నించిన దుండగులు
రేవంత్ రెడ్డి వస్తున్నాడని పవన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు?
నేతకాని మహర్ రాష్ట్రస్థాయి సదస్సుకు మాల మహానాడు మద్దతు
మోదీని క‌లిసిన శ్రీలంక మాజీ క్రికెట‌ర్లు.. జ‌య‌సూర్య విజ్ఞ‌ప్తికి స్పందించిన ప్ర‌ధాని