2025-26 రాష్ట్ర బడ్జెట్లో వికలాంగులకు మొండి చెయ్యి
---- బడ్జెట్ సవరించి 5శాతం నిధులు కేటాయించాలి ---- వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నారాయణపేట జిల్లా అధ్యక్షురాలు రాధమ్మ
నమస్తే భారత్ / మద్దూరు, :రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమనికి నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యనికి నిరసనగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నారాయణపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం మద్దూరు ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షురాలు రాధమ్మ,ప్రధాన కార్యదర్శి కే కాశప్ప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో చేసిన అన్యాయాన్నే 2025-26 బడ్జెట్లో చేసిందని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2,26,982 కోట్ల రెవెన్యూ వ్యయం బడ్జెట్లో 2016 ఆర్ పి డి చట్టం ప్రకారం బడ్జెట్లో 5శాతం అంటే 11,349.1కోట్ల నిధులు కేటాయించాలని అన్నారు.కానీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో వికలాంగుల అభివృద్ధి, సంక్షేమనికి పైసా కూడా కేటాయించలేదని అన్నారు.స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో అంతర్బాగంగా వికలాంగుల సంక్షేమ శాఖ చూపి నిధులు కేటాయించడం లేదు. ఇతర రంగాలకు నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం 12 శాతం జనాభా ఉన్న వికలాంగుల సంక్షేమనికి నిధులేందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆసరా పెన్షన్స్ పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బడ్జెట్లో పెన్షన్ పెంపు కోసం ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు.పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖకు 31,605 కోట్లు కేటాయించారాని, ఇందులోనే ఆసరా పెన్షన్స్ బడ్జెట్ ఉండడం అంటే రాబోయే రోజుల్లో ఆసరా పెన్షన్స్ లబ్ధిదారులకు కష్టాలు తప్పవని అన్నారు.
ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో 151 అంశాలను ప్రస్థావించారాని అందులో వికలాంగులకు సంబందించిన ఒక్క అంశం కూడా లేదన్నారు. వికలాంగులకు స్వయం ఉపాధి రుణాలు, వివాహ ప్రోత్సాహకం,సహాయ పరికరాల కోసం నిధులు కేటాయించకుండా వికలాంగులకు ఏవిదంగా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు.నిధుల కొరత వలన వికలాంగుల కార్పొరేషన్ నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను సవరించి ప్రత్యేకoగా వికలాంగుల సంక్షేమనికి బడ్జెట్ కేటాయించాలని, ఆసరా పెన్షన్స్ పెంపుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఆర్డిపి సంఘం కొత్తపల్లి మండలం అధ్యక్షులు వెంకటయ్య టి రాములు చెన్నప్ప, హనుమంతు, లక్ష్మమ్మ, మంగమ్మ, శకుంతల చిట్టెమ్మ, నారెమ్మ, రవీంద్రమ్మ, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
