పీజీ కళాశాలకు కేటాయించిన స్థలంలో నూతన భవనాన్ని తక్షణమే నిర్మించాలి రెగ్యులర్ ప్రిన్సిపాల్ ని తక్షణమే నియమించాలి

డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పీజీ కళాశాల ఎదుట ధర్నా పీజీ కళాశాలను ఎత్తివేసే కుట్రలో అధికారులు ఎత్తేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తాం.

పీజీ కళాశాలకు కేటాయించిన స్థలంలో నూతన భవనాన్ని తక్షణమే నిర్మించాలి  రెగ్యులర్ ప్రిన్సిపాల్ ని తక్షణమే నియమించాలి

నమస్తే భారత్ :-మహబూబాబాద్  : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పిజి కళాశాలకు కేటాయించిన స్థలంలో తక్షణమే నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కళాశాలకు రెగ్యులేట్ ప్రిన్సిపాల్ ను నియమించాలని డిఎస్ఎఫ్ఐ (భారత ప్రజాతంత్ర విద్యార్థి సంఘం) ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు.. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాలోతు శాంతి కుమార్, సూర్య ప్రకాశ్ లు మాట్లాడుతూ పీజీ కళాశాలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్ ని నియమించాలని, ప్రిన్సిపాల్ లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని, పీజీ కళాశాలకు సొంత భవనం లేక బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు అడ్మిషన్ కు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.2013 లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్లు సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా కళాశాల ఏర్పాటయిందని, ఐదు సంవత్సరాల పూర్తి అయితే దానిని రెగ్యులర్ చేయాలని యూజీసీ నియమ నిబంధనలో ఉంది, అయినా సరే ఇప్పటికీ 13 సంవత్సరాలు గడుస్తున్నా కూడా రెగ్యులర్ కళాశాల నియమించకుండా ప్రభుత్వ అధికారులు, వీసీలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.దాంతోపాటు ఈ కళాశాలకు 20 మంది ఉండవలసిన అధ్యాపకులు, కేవలం ఇద్దరితోటే నడిపిస్తున్నారని అది కూడా పార్ట్ టైం కింద ఇద్దరూ బోధిస్తున్నారని, దీని ద్వారా విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.తక్షణమే పిజీ కళాశాలకు నూతన భవనాన్ని కేటాయించాలని, అదేవిధంగా రెగ్యులర్ ప్రిన్సిపాల్ ను నియమించాలని డిమాండ్ చేశారు, లేని యెడల భారత ప్రజాతంత్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులను సమీకరించి సమరసిల పోరాటాలు నిర్వహిస్తామని వారు తెలిపారు..ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు వీరన్న, విద్యార్థినులు నిరోష, స్వప్న, అంజలి, రోహిణి, తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష, 1000/- జరిమానా  డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష, 1000/- జరిమానా 
    సిద్దిపేట: ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి  వాహనాలు  నడిపిన 08, మందికి ₹ 11,000/- వేల రూపాయల జరిమానా సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ
#Draft: Add Your Title
తక్కువ ధరకి బంగారం ఇప్పిస్తానని చెప్పి ప్రజలను మోసం చేసినటువంటి వ్యక్తి నీ అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించిన టూ టౌన్ పోలీసులు నిందితుని వివరాలు
పోలీసు కళాబృందం ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు అనే కార్యక్రమం తేదీ: 07-04-2025 రాత్రి రాజగోపాలపేట   పోలీస్ స్టేషన్ పరిధిలోని " నంగునూరు మండల కేంద్రంలో " నిర్వహించడం జరిగింది
ఉపాధి కూలీల‌కు క‌నీస వ‌స‌తులు క‌ల్పించాలి : జూకంటి పౌల్‌
రెండు గంటలైనా రాని 108 అంబులెన్స్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు.. ఆ ఐదుగురికి ఉరే ఖరారు..!