భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్
షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ తాపర్ 94వ అమరవీర వర్ధంతి సందర్భంగా వారికి జోహార్లు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి మాగం లోకేష్ భగత్ సింగ్ స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలి
నమస్తే భారత్ :-గార్ల : అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో గార్ల మండల కేంద్రంలో భగత్ సింగ్, రాజ్ గురు,సుక్ దేవ్ చిత్రపటానికి పూలమాలలు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమైక్య జిల్లా అద్యక్షులు మాగం లోకేష్ మాట్లాడుతూ,, దేశ స్వతంత్ర పోరాట వీరుడు భగత్ సింగ్ అని సూచించారు. నేటి యువత భగత్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి అని కోరారు. భగత్ సింగ్ విప్లవవిరుడు భగత్ సింగ్ చదువుకునే రోజుల్లోనే జూలియాన్ వాలాబాగ్ దుర్ఘటనతో చలించిపోయారని అన్నారు. దేశ స్వతంత్ర కోసం 23 సంవత్సరాలకి ప్రాణ త్యాగం చేసి ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశారని అన్నారు. భగత్ సింగ్ స్ఫూర్తితో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దేశ స్వతంత్ర పోరాట వీరుడు భగత్ సింగ్ కు భారతరత్న ప్రకటించి, ఆయన జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాము.సూర్యడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెగిలించిన ఉరికొయ్యలను సైతం ముద్దాడిన యువకిశోరాల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కస్తూరిబా ఏఐఎస్ఎఫ్ సభ్యులు నందిని,వర్శ,మోనికా,ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

