గిరిజన దర్భాల్లో వృధా చేసుకున్న ప్రతి గిరిజనుడికి జీవనోపాధి కల్పిస్తాం
ఐటీడీఏ పిఓపి రాహుల్
నమస్తే భారత్: భద్రాచలం : వివిధ ఆదివాసి గిరిజన గ్రామాల నుండి వివిధ వ్యక్తిగత సమస్యలు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల ద్వారా జీవనోపాధి పెంపొందించుకోవడానికి గిరిజన దర్బార్ లో దరఖాస్తు చేసుకున్న ప్రతి గిరిజన కుటుంబాలకు అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా యూనిట్ అధికారులు కృషి చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. సోమవారం నాడు ఐటీడీఏ సమావేశం మందిరంలో గిరిజన దర్బార్ ప్రారంభానికి ముందు సంబంధిత యూనిట్ అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించిన అనంతరం, వివిధ ఆదివాసి గిరిజన గ్రామాల నుండి గిరిజన దర్బార్ లో వివిధ సమస్యల గురించి అర్జీలు సమర్పించడానికి వచ్చిన గిరిజనుల నుండి ఆయన అర్జీలు స్వీకరించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి, మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ అర్హులైన ప్రతి గిరిజనులకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. గిరిజనులు సమర్పించిన అర్జీలలో పౌడు భూముల సమస్యలు, పోడు భూముల పట్టాల కొరకు, భూ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, జీవనోపాధి పెంపొందించుకోవడానికి వ్యక్తిగత రుణాల కొరకు, వ్యవసాయ భూములకు కరెంటు మోటార్లు ఇప్పించుట కొరకు, గిరిజన గ్రామాలలో విద్యుత్ సౌకర్యం కల్పించుట కొరకు, కుటుంబాన్ని పోషించు కోవడానికి జీవన భృతి కల్పించుట కొరకు, సోలార్ ద్వారా విద్యుత్ కనెక్షన్ ఇప్పించుట కొరకు, వ్యవసాయంనకు నీటి వసతి కల్పించుకోవడానికి బోర్లు అనుమతి కొరకు, నూతనంగా ఇసుక సొసైటీలు మరియు మత్య సొసైటీలు ఏర్పాటు కొరకు, వృద్ధాప్యపు, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్ ఇప్పించుట కొరకు, ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో జీవనోపాధి పెంపొందించుకోవడానికి వృత్యంతర శిక్షణలు ఇప్పించుట కొరకు, దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయం అందించడం కొరకు, గిరిజన గ్రామాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించుట కొరకు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల కొరకు గిరిజనులు అర్జీలు సమర్పించారని ఆయన అన్నారు. గిరిజన దర్బార్ లో వచ్చిన అర్జీలు అన్ని ప్రత్యేకమైన రిజిస్టర్లో నమోదు తో పాటు ఆన్లైన్ చేయించి, అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు విడతలవారీగా సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఎస్ డి సి రవీంద్రనాథ్, ఏవో సున్నం రాంబాబు, ఎస్ ఓ ఉదయభాస్కర్, ఉద్యానవనాధికారి ఉదయ్ కుమార్, ఏపీవో పవర్ వేణు, డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ లక్ష్మీనారాయణ, డిఎంజిసిసి సమ్మయ్య, మేనేజర్ ఆదినారాయణ, ఐసిడిఎస్ సూపర్వైజర్ సుశీల మరియు వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది నరేందర్, సౌమ్య, సమ్మక్క, జోగారావు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

