సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసిన కాంగ్రెస్

బి.సి బిల్లు,ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదించిన కాంగ్రెస్ కు కృతజ్ఞతలు.    వరంగల్ జిల్లా కోర్టులో మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్న న్యాయవాదులు

సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసిన కాంగ్రెస్

నమస్తే భారత్: హనుమకొండ :  సామాజిక న్యాయానికి కుల జనగణన ఎక్సేరే లాంటిదని, సామాజిక న్యాయమే తన జీవిత లక్ష్యమని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి, అసెంబ్లీ ఎన్నికల వేళ కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు పిసిసి లీగల్ సెల్ అద్యక్షులు పొన్నం అశోక్ గౌడ్ సూచన మేరకు వరంగల్, హనుమకొండ జిల్లా న్యాయవాదులు గురువారం కోర్టులోని అంబేద్కర్ హాల్ లో మిఠాయిలు పంచుకొని సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు తీగల జీవన్ గౌడ్, హనుమకొండ బార్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి ముద్దసిర్, కాంగ్రెస్ లీగల్ సెల్  వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, రాష్ట్ర కన్వీనర్లు కూనూరు రంజిత్ గౌడ్, పిల్లి కార్తీక్, కందుకూరి రజనీకాంత్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ అద్యక్షులు శామంతుల శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు అంబరీష్ రావు, పులి సత్యనారాయణ, ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ లు మాట్లాడారు.   దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో కుల జనగణన జరిపి బి.సి లకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, బి.సి ఉద్యమకారులకు కృతజ్ఞతలు తెలిపారు. స్వాతంత్రం వచ్చి 77 ఏండ్లు దాటినా 60 శాతం పైగానున్న బి.సి జనగణన చేయకోవడం దుర్మార్గమని, అణగారిన వర్గాల దుస్థితిని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ బి సి ల కోసం 42 శాతం రిజర్వేషన్ల బిల్లు, ఎస్సి ల కోసం ఎ బి సి వర్గీకరణ బిల్లును ఒకేరోజు అసెంబ్లీలో తీర్మానం చేయడం గొప్ప విషయమని అందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బి.సి సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, పిసిసి అద్యక్షులు మహేష్ గౌడ్, మాజీ ఎంపి మధుయాష్కీ, ఇతర మంత్రులకు తెలంగాణ అణగారిన వర్గ ప్రజలు రుణపడి ఉంటారని వారు అన్నారు. అసెంబ్లీలో బిల్లు తీర్మానంతోనే బి.సి లు ఆగిపోరాదని రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం చట్టం చేసే వరకు పోరాటం చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన న్యాయవాదులు బి.సి రిజర్వేషన్లు చట్టం అయ్యే వరకు మరో తెలంగాణ ఉద్యమం లాగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గునిగంటి శ్రీనివాస్, దయాన్ శ్రీనివాస్, కొక్కొండ రమేష్, సిద్దునాయక్, చిర్ర రాజు, రమేష్ నాయక్, సురేష్, ఎగ్గడి సుందర్ రామ్, పల్లె ప్రశాంత్, శ్రీలత, ప్రియాంక, తులసిగారి రాజబాపు, అమృత రావు, దండు మోహన్, హరీష్, చింత నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నేటి నుంచి సిద్దేశ్వర స్వామి జాతర.. వాల్ పోస్టర్‌ ఆవిష్కరణ నేటి నుంచి సిద్దేశ్వర స్వామి జాతర.. వాల్ పోస్టర్‌ ఆవిష్కరణ
ఝరాసంగం, ఏప్రిల్ 10 : అతి పురాతనమైన పొట్టిపల్లి సిద్దేశ్వర స్వామి జాతర మహోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ మండల పరిధిలోని బర్దిపూర్ దత్తగిరి...
బీహార్‌లో పిడుగుపాటుకు 21 మంది మృతి
నేను వేరే పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నా కాని.. ఎందుకు చేసుకోలేదంటే.. : రేణూ దేశాయ్
రెండంచెల భద్రత, బుల్లెట్‌ప్రూఫ్‌ వెహికల్‌, భద్రతగా స్వాత్‌ కమాండోస్‌.. తహవూర్‌ రాణాకు రాచమర్యాదలు
పెంచిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి: సీపీఎం
మొదలుపెట్టని పూడికతీత పనులు.. మురికి కూపంగా మారిన నాలాలు.. డ్రైనేజీలు
షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైన దుకాణాలను ప్రజాట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తా