సైబర్ నేరాల నుండి అప్రమత్తంగా ఉండాలి: ఉట్కూర్ ఎస్సై కృష్ణంరాజు

సైబర్ నేరాల నుండి అప్రమత్తంగా ఉండాలి: ఉట్కూర్ ఎస్సై కృష్ణంరాజు

నమస్తే భారత్  /   నారాయణపేట్ జిల్లా

  • సైబర్ నేరానికి గురైతే 1930 గుర్తుంచుకోవాలి.
  • అపరిచిత వ్యక్తుల నుండి అప్రమత్తంగా ఉండాలి.
  • యువకులు బెట్టింగ్కు పాల్పడరాదు.

జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్  ఆదేశాల మేరకు ఉట్కూరు మండల కేంద్రంలో ప్రజలకు, యువకులకు, సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాలు, అపరిచిత వ్యక్తుల నుండి అప్రమత్తంగా ఉండాలని, IPL  క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడరాదని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా  సందర్భంగా ఎస్ఐ కృష్ణంరాజు మాట్లాడుతూ ప్రజలూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ సైబర్ నేరానికి గురైతే టోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని తెలిపారు. యువకులు ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడరాదని సూచించారు. బెట్టింగ్స్ వల్ల ఆర్థికంగా నష్టపోయి, ఆత్మహత్యలకు దారితీస్తాయని, డబ్బులు లేకపోతే దొంగతనాలకు పాల్పడతారని అలాంటి వాటికి దూరంగా ఉండాలని, తమ పిల్లలు చుట్టుపక్కల వారు బెట్టింగ్ కు పాల్పడితే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. అపరిచిత వ్యక్తుల నుండి అప్రమత్తంగా ఉండాలని ఎవరి పైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో  హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్స్ మహేష్, విజయ్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇదేం ఆట..! పెవిలియన్‌కు క్యూ కట్టిన సన్‌రైజర్స్‌ బ్యాటర్లు.. అసహనం వ్యక్తం చేసిన కావ్య మారన్‌..! ఇదేం ఆట..! పెవిలియన్‌కు క్యూ కట్టిన సన్‌రైజర్స్‌ బ్యాటర్లు.. అసహనం వ్యక్తం చేసిన కావ్య మారన్‌..!
ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం సొంత మైదానంలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లోనూ బ్యాట్స్‌మెన్‌ మరోసారి విఫలమయ్యారు. ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ,...
నిరుపేదల ఆత్మగౌరవ పథకమే సన్నబియ్యం : కలెక్టర్ సిక్తా పట్నాయక్
బ్రహ్మోత్సవాలకు మహామ్మాయిదేవి ముస్తాబు
మేడ్చల్‌లో యువతిపై లైంగికదాడికి యత్నించిన దుండగులు
రేవంత్ రెడ్డి వస్తున్నాడని పవన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు?
నేతకాని మహర్ రాష్ట్రస్థాయి సదస్సుకు మాల మహానాడు మద్దతు
మోదీని క‌లిసిన శ్రీలంక మాజీ క్రికెట‌ర్లు.. జ‌య‌సూర్య విజ్ఞ‌ప్తికి స్పందించిన ప్ర‌ధాని