జానంపేట గుండుకేరి హనుమాన్ మరియు శివాలయం దేవాలయాల నిర్మాణానికి సహకరిద్దాం
ఫరూక్ నగర్ 13వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నందిగామ శ్రీనివాస్ ఔదార్యం , ఆలయ నిర్మాణానికి (2500 ఇటుక) విరాళం
నమస్తే భారత్,షాద్ నగర్ : ఆధ్యాత్మికత అంటే ఏదైనా ప్రత్యేక సాధన కాదనీ ఇది ఒక నిర్దిష్ట మార్గం అనీ అక్కడికి చేరుకోవడానికి, చేయవలసినవి చాలా ఉన్నాయని అందులో ఆధ్యాత్మిక చింతన ఒకటని ఫరూక్ నగర్ 13వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నందిగామ శ్రీనివాస్ వారి భక్తిని చాటుకున్నారు. జానంపేట గ్రామం, గుండుకేరిలో హనుమాన్ మరియు శివాలయం నిర్మిస్తున్న దేవాలయాల పునర్నిర్మాణానికి నందిగామ శ్రీనివాస్ "2500 ఇటుక " విరాళాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ పెద్దలకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. శరీరం, మనస్సు, భావోద్వేగాలు మరియు శక్తులను ఒక నిర్దిష్ట స్థాయి పరిపక్వతకు పెంపొందించుకుంటే, మీలో ఇంకేదో వికసిస్తుంది - అదే ఆధ్యాత్మికత అని అన్నారు. ఈ సృష్టిలో ఆధ్యాత్మికతకు ఉన్న శక్తి మరొకటి లేదని అన్నారు. ఎంతో భక్తిశ్రద్ధలతో స్థానిక కమిటీ నాయకులు తదితరులు ఆలయ నిర్మాణానికి పూనుకోవడం అభినందనీయమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆలయ నిర్మాణానికి తమ వంతు సాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

