ప్రతి గ్రామ పంచాయితీలో ఒక్కటీ, మేజర్ గ్రామ పంచాయితీలలో 3 నుండి 5 చలి వేంద్రాలు ఏర్పాటు.
జిల్లా ప్రజలకు అందుబాటులో మొత్తం 210 చలి వేంద్రాలు. జిల్లా పంచాయితి అధికారి దేవ్ రాజ్.
నమస్తే భారత్: ములుగు బ్యూరో : రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, కమిషనర్, జిల్లా కలెక్టర్, ములుగు ఆదేశాల మేరకు ములుగు జిల్లాలో ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతి గ్రామ పంచాయతీ లలో చలి వేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రదేశాలలో ఏర్పాటు చెయ్యడం జరిగిందని జిల్లా పంచాయితి అధికారి దేవ్ రాజ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మండుతున్న ఎండల సమయంలో ప్రజలు తమ అవసరాలు నిమిత్తం బయటికి వెళ్లినప్పుడు తాగు నీటికి ఇబ్బంది ఏర్పడకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ప్రజలు చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ, ఆదేశాల మేరకు మూగజీవుల కోసం, పక్షులు కోసం, కోతుల కోసం ప్రత్యేకంగా నీటి తోట్లు, ప్లాస్టిక్ టబ్స్ కలిపి మొత్తం 360 త్రాగు నీటి తోట్ల ను ఏర్పాటు చెయ్యడం జరిగిందని ఆయన తెలిపారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

