తొర్రూరు పట్టణంలో గల్లీ గల్లీ తిరుగుతున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
నమస్తే భారత్ :-తొర్రూర్ పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి తొర్రూరు పట్టణంలోని పలు వార్డులను మున్సిపల్ అధికారులు, పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పనులను పరిశీలించారు. ఇంకంప్లీట్ గా ఉన్న రోడ్ల వల్ల స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకుని, వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఎమ్మెల్యే గల్లీ గల్లీల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వీక్షించారు. స్థానిక ప్రజలు తాగునీటి సమస్య, డ్రైనేజీ లీకేజీలు, మురుగు కాల్వల నిర్వహణలో లోపాలు తదితర అంశాలను ఎమ్మెల్యే కి వివరించారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత మున్సిపల్ అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.ఈ సందర్శన సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.పట్టణ అభివృద్ధి మా ప్రాధాన్యమే. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మౌలిక సదుపాయాలను వేగంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. పనులు నాణ్యతతో, సమయానికి పూర్తయ్యేలా అధికారులపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు.అసంపూర్తిగా ఉన్న రహదారులు, డ్రైనేజీలు వెంటనే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. నాణ్యతా ప్రమాణాలను పాటించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా పనులను సమయానికి పూర్తి చేయాలి. పట్టణంలో మురుగు కాల్వలు మళ్లీ పూడిపోకుండా ప్రణాళికాబద్ధంగా శుభ్రపరచాలి.అని స్పష్టం చేశారు.ఈ పర్యటనతో ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే కి తెలియజేయడం వల్ల, త్వరలోనే అభివృద్ధి పనులు వేగంగా సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కమిషనర్, మాజీ వార్డు కౌన్సిలర్లు, బ్లాక్ మరియు పట్టణ అధ్యక్షులు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే పర్యటనతో స్థానిక సమస్యలపై అధికారులు చురుగ్గా స్పందించేందుకు సిద్ధమయ్యారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
