ప్యాసింజర్ రైళ్లు నడపాలని ఎంపీ డీకే అరుణకు బిజ్వార్ సామజిక వేత మహేష్ గౌడ్ వినతి
నమస్తే భారత్ / ఉట్కూర్ మండలం : సామాజిక కార్యకర్త బిజ్వార్ మహేష్ గౌడ్ దక్షిణ మధ్య రైల్వే వారు ఆరు నెలల క్రితం కాచిగూడ నుంచి దేవరకద్ర మీదుగా(కాచిగూడ-రాయచూర్) జక్లేర్,మక్తల్,కృష్ణ,రాయిచూర్ కు డెమో రైలు ప్రారంభించారని కానీ ఈ రైలు ఈ ప్రాంత ప్రయాణికులకు నిరుపయోగంగా ఉందని తక్షణమే రైలు వేళల్లో మార్పులు చేసి మరిన్ని ప్యాసింజర్ రైళ్లు నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీ డీకే అరుణకు సామాజిక కార్యకర్త బిజ్వార్ మహేష్ గౌడ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డెమో రైలు హైదరాబాద్ కాచిగూడ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి జక్లేర్,మక్తల్ కు సుమారు రెండు,మూడు గంటల మధ్యలో వస్తుందని తిరుగు ప్రయాణం రాయిచూర్ నుంచి సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి రాత్రి తొమ్మిది,పదింటికి కాచిగూడ చేరుకుంటుందని తెలిపారు.ఈ రకమైన రైల్వే టైం టేబుల్ ఉండటం వల్ల ఈ ప్రాంత ప్రయాణికులు రైలు ప్రయాణానికి నోచుకోవడం లేదని పేర్కొన్నారు.అలాకాకుండా ఉదయం వేళల్లో ఇటు కృష్ణ నుండి మక్తల్,జక్లేర్ మీదుగా ఉదయం ఆరు,ఏడు,ఎనిమిది గంటల మధ్యలో ఎప్పుడు బయలుదేరి వెళ్లిన హైదరాబాద్ కి మధ్యాహ్నం వరకు చేరుకుంటుందని తిరుగు ప్రయాణం అటు హైదరాబాద్-కాచిగూడ నుంచి సాయంత్రం 5,6గంటల మధ్యలో ఎప్పుడు బయలుదేరిన ఈ ప్రాంతానికి రాత్రి వరకు చేరుకోవచ్చు అని తెలిపారు.ఈ రకమైన వేళల్లో రైలు నడిపితే ఈ ప్రాంత ప్రయాణికులు హైదరాబాద్ కు ఉదయం వెళ్లి అన్ని పనులు ముగించుకొని రాత్రి వరకు ఇంటికి చేరుకోగలుగుతారని తెలిపారు.ఈ రైలుతోపాటు ఈ మార్గంలో మరిన్ని ప్యాసింజర్,ఎక్స్ ప్రెస్ రైళ్లను నడిపే విధంగా దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులకు సూచించాలని ఎంపీ డీకే అరుణను కోరినట్లు ఆయన తెలిపారు.అదే విధంగా కృష్ణా-వికారాబాద్ రైల్వే లైన్ సర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయించినందుకు మహేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
