సీనియర్ సిటిజన్  సమస్యను పరిష్కరించిన సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను

సీనియర్ సిటిజన్  సమస్యను పరిష్కరించిన సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను

నమస్తే భారత్: సిద్దిపేట : దాసరి రామలింగం తండ్రి లక్ష్మీనారాయణ, వయస్సు 78 సంవత్సరాలు, రిటైర్డ్ టీచర్, నివాసం నంగునూరు  అతను తన రిటైర్డ్ అయిన డబ్బులతో  ఒక సంవత్సరం క్రితము నంగునూరు గ్రామ శివారులో కారంపూరి వైకుంఠం వద్ద  ఒక్క ఎకరం స్థలము మరియు నడవడానికి బాటను డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసినాడు. రెండు నెలల క్రితం దాసరి రాజలింగంకు ఇచ్చిన బాటను వైకుంఠం అల్లుడు వేముల రమేష్ తండ్రి వెంకటయ్య, నివాసం  పెద్ద సముద్రాల  అతను జెసిబి తో  బాటలోనుండి నడవకుండా మొత్తం గుంతలు తీసినాడు  ఎవరికి చెప్పినా సమస్య పరిష్కరించకపోవడంతో  ఫిర్యాది దాసరి రాజలింగం  సిద్దిపేట రూరల్ సీఐ కార్యాలయానికి వచ్చి  దరఖాస్తు ఇచ్చినాడు రూరల్ సీఐ శ్రీను  సీనియర్ సిటిజన్ యొక్క సమస్యను పరిష్కరించాలని ఉద్దేశంతో  ఎలాంటి జాప్యం లేకుండా అదే రోజు సంఘటన స్థలానికి వెళ్లి  బాటలో గుంతలు తీసిన స్థలాన్ని పరిశీలించి వైకుంఠం మరియు వేముల రమేష్ ను పిలిపించి  కౌన్సిలింగ్ నిర్వహించి  వెంటనే బాటలో ఉన్న గుంతలు పూడ్చివేయించినారు. ఇప్పుడు ఫిర్యాది అదే బాటలో నుండి నడుస్తున్నాడు. త్వరగా సమస్యను పరిష్కరించినందుకు ఫిర్యాది అయినా దాసరి రామలింగం ఈరోజు రూరల్ సీఐ శ్రీను కలవడానికి వచ్చేటప్పుడు శాలువా, స్వీట్స్ తీసుకుని వచ్చినాడు. తన సమస్యను పరిష్కరించిన  రూరల్ సీఐ శ్రీనుకు కృతజ్ఞతలు తెలిపి శాలువా స్వీట్స్ ఇవ్వడానికి ప్రయత్నించగా సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను  సీనియర్ సిటిజన్ అయిన రాజలింగాన్ని శాలువతో ఘనంగా సన్మానించి స్వీట్స్ అందజేశారు. ఈ సందర్భంగా రామలింగం మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బంది లేకుండా తన సమస్యను త్వరగా పరిష్కరించిన  సిద్దిపేట పోలీసులను అభినందించారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మొదలుపెట్టని పూడికతీత పనులు.. మురికి కూపంగా మారిన నాలాలు.. డ్రైనేజీలు మొదలుపెట్టని పూడికతీత పనులు.. మురికి కూపంగా మారిన నాలాలు.. డ్రైనేజీలు
ఎల్బీనగర్‌, ఏప్రిల్‌ 8 : ఎల్బీనగర్‌ జోన్‌లో పూడికతీత పనులు ప్రారంభం కాలేదు. హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌ సర్కిళ్ల పరిధిలోని చాలా ప్రాంతాల్లో డ్రైన్లు, నాలాలు పూడుకుపోయాయి....
షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైన దుకాణాలను ప్రజాట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తా
మధిరలో పూర్తైన‌ వంద పడకల హాస్పిటల్‌ను ప్రారంభించాలి : ఏలూరి నాగేశ్వర్‌రావు
కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాలుగా రేషన్‌ దుకాణాలు : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
గర్భిణుల‌కు పోష‌కాహారం అందించాలి : సీడీపీఓ లక్ష్మి ప్రసన్న
వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ చ‌ట్టం అమ‌లుపై సీఎం మ‌మ‌త సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌
పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని సీపీఎం నిరసన