రాయపోల్, దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్లను సందర్శించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపిఎస్
నమస్తే భరత్ సిద్దిపేట : పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను, మరియు సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్ రికార్డ్, రైటర్ రూమ్ పరిశీలించారు. మరియు పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు పోలీస్ స్టేషన్లో వివిధ కేసులలో ఉన్న వాహనాల యొక్క అడ్రస్ తెలుసుకుని సంబంధిత యజమానులకు త్వరగా అప్పగించాలని సంబంధిత ఎస్ఐలకు సూచించారు అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలి ప్రజల రక్షణ ధ్యేయంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరించాలి ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్ వాటిపై నిఘా పెంచాలని తెలిపారు ఇసుక,జూదం, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయాలని సూచించారు పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలు మరియు పోలీస్ స్టేషన్ రికార్డ్స్, సిడి ఫైల్స్, తనిఖీ చేశారు ప్రతి రికార్డ్ అప్డేట్ ఉండాలని అధికారులకు సిబ్బందికి సూచించారు రాయపోల్ పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ సిసిటిఎన్ఎస్ డాటా అప్డేట్ ఉన్నందున అధికారులను సిబ్బందిని అభినందించారు పోలీస్ సిబ్బంది యొక్క సమస్యలు అడిగి తెలుసుకుని ఏవైనా సమస్యలు ఉంటేనే వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు పోలీస్ అధికారులు సిబ్బంది క్రమశిక్షణతో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి నీతి నిజాయితీగా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు (విపిఓ) విలేజ్ పోలీస్ ఆఫీసర్ కేటాయించిన గ్రామాలకు కేటాయించిన వార్డులకు తరచుగా సందర్శిస్తూ ఇన్ఫర్మేషన్ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని సూచించారు విజబుల్ పోలీసింగ్ పై దృష్టి సారించాలని ఉదయం సాయంత్రం విసేబుల్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని అధికారులకు సిబ్బందికి సూచించారు సిబ్బంది విధి నిర్వహణతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని సూచించారు. సమయం దొరికినప్పుడల్లా వాకింగ్ రన్నింగ్ యోగా చేస్తూ ఉండాలని తెలిపారు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని తెలిపారు. పాత నేరస్తులైన కేడీలు డీసీలు సస్పెక్ట్ లను తరచుగా తనిఖీలు చేయాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని తెలిపారు. డ్రగ్స్ దాని యొక్క ప్రభావం, సైబర్ నేరాలు తదితర అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు రోడ్డు ప్రమాదాల నివారణ గురించి తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని తెలిపారు రోడ్డు ప్రమాదాల నివారణ గురించి అవసరమైన ప్రదేశాలలో బ్లాక్ స్పాట్స్ వద్ద ఆర్ అండ్ బి అధికారుల సమన్వయంతో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి, తొగుట సిఐ లతీఫ్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎస్బి ఇన్స్పెక్టర్లు శ్రీధర్ గౌడ్, రాయపోల్ ఎస్ఐ రఘుపతి, దౌల్తాబాద్ ఎస్ఐ ప్రేమ్ దీప్, మరియు ఇరు పోలీస్ స్టేషన్ల సిబ్బంది, సీసీ నితిన్ రెడ్డి, పోలీస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

