గోటి తలంబ్రాల శోభయాత్ర చేస్తున్న హిందూ బంధువులు

గోటి తలంబ్రాల శోభయాత్ర చేస్తున్న హిందూ బంధువులు

  • వడ్లు ఒలుపు శ్రీరాముని పిలుపు
  • డోర్నకల్ పట్టణంలో ఘనంగా కోటి ,కోటి తలంబ్రాల శోభయాత్ర
  • శ్రీరామ నామంతో మారుమోగిన పట్టణం. 

 నమస్తే భారత్ :-డోర్నకల్  : శ్రీ సీతారాముల స్వామి వారి ఆశీస్సులతో డోర్నకల్ పట్టణంలో అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆధ్యాత్మిక కమిటీ సభ్యులకు కోరారు.ఆదివారం డోర్నకల్ పట్టణ కేంద్రంలోని పాత డోర్నకల్ హనుమాన్ టెంపుల్ ఆంజనేయస్వామి ఆలయం నుండి మెయిన్ రోడ్ ముత్యాలమ్మ గుడి సెంటర్ మీదుగా రైల్వే స్టేషన్ రామాలయం వరకు అదే విధంగా పట్టణంలోని ప్రధాన వీధులలో డోర్నకల్ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ భద్రాద్రి సీతారాముల స్వామివారి కోటి,గోటి తలంబ్రాలు శోభాయాత్ర హిందూ బంధువులంతా కలిసి అంగరంగ వైభవంగా  ఘనంగా నిర్వహించారు. డోర్నకల్ పట్టణంలో డిజె సప్పట్లతో ఆటపాటలతో అడుగడుగునా వీధులలో హిందూ బంధువులు మంగళ హారతి, నీళ్ల బిందెలతో ఘన స్వాగతం పలికిన మహిళ మణులు. శ్రీరామ నామంతో మారుమోగిన డోర్నకల్ పట్టణం. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వేణుగోపాల్ లడ్డ, మారబోయిన శ్రీనివాస్, నేతికోప్పల సురేష్ మాట్లాడుతూ డోర్నకల్ చరిత్రలోనే ప్రప్రథమంగా కనీ విని ఎరుగని రీతిలో శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి సౌజన్యంతో .. వడ్లు ఒలుపు రామున్ని పిలుపు శ్రీ రామనామ జపాన్ నామంతో భద్రాది రామయ్య అనుగ్రహంతో మనం తయారుచేసిన కోటి తలంబ్రాలు సీతారాములు పై  మనకున్న భక్తికి నిదర్శనాలు అని అన్నారు. కోటి,గోటి తలంబ్రాలు శోభయాత్ర విజయవంతం చేసిన దాతలకు, ఎందుకు బంధువులకు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల అనుబంధాల నాయకులు, వివిధ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, హిందూ బంధువులు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఉపాధి కూలీల‌కు క‌నీస వ‌స‌తులు క‌ల్పించాలి : జూకంటి పౌల్‌ ఉపాధి కూలీల‌కు క‌నీస వ‌స‌తులు క‌ల్పించాలి : జూకంటి పౌల్‌
రాజాపేట, ఏప్రిల్ 08 : ప‌ని ప్ర‌దేశాల్లో ఉపాధి హామీ కూలీల‌కు క‌నీస వ‌స‌తులు క‌ల్పించాల‌ని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జూకంటి పౌల్ అన్నారు....
రెండు గంటలైనా రాని 108 అంబులెన్స్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు.. ఆ ఐదుగురికి ఉరే ఖరారు..!
ట్రాఫిక్ సిబ్బందిపైకి దూసుకెళ్లిన లారీ.. కానిస్టేబుల్‌ మృతి
హసన్‌పర్తిలో ఆర్టీసీ బస్సు బోల్తా.. ఆరుగురికి తీవ్రగాయాలు
శ్రీరామ నవమి ఉత్సవాలు.. రమణీయంగా రథోత్సవం
ఇదేం ఆట..! పెవిలియన్‌కు క్యూ కట్టిన సన్‌రైజర్స్‌ బ్యాటర్లు.. అసహనం వ్యక్తం చేసిన కావ్య మారన్‌..!