నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రభుత్వ ఉన్నత అధికారులకు భారత నాణ్యత ప్రమాణాల బ్రోచర్ల అందజేత.
నాగర్ కర్నూల్ జిల్లా జాయింట్ కలెక్టర్ కి బిఐఎస్ బ్రోచర్ అందజేత - బిఐఎస్ ఆర్గనైజర్: ఎన్. ప్రవీణ
నమస్తే భారత్,షాద్ నగర్ మార్చ్,26 : ప్రపంచ వినియోగదారుల దినోత్సవం పురస్కరించుకొని భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు ఆహారం మరియు సరఫరాల మంత్రిత్వ శాఖ వారిచే వితరణ చేయబడిన భారత నాణ్యత ప్రమాణాల బ్రోచర్లను నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు బి ఐ ఎస్ ఆర్గనైజర్ శ్రీమతి ప్రవీణ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. భారత నాణ్యత ప్రమాణాల సంస్థ వివిధ రకాల వస్తువులు, వాహనాలు, పరికరాలు పనిముట్లు, తినుబండారాలు, ఆహార ఉత్పత్తులు, వంట నూనెలు ఆభరణాలు, వస్త్రములు, మందులు, ఎరువులు, పురుగు మందులు మరియు విత్తనాల లాంటి అనేక రకాల ఉత్పత్తుల తయారీ కోసం నాణ్యత ప్రమాణాలు తనిఖీ చేసి ఆయా కంపెనీలకు అమ్మకం లైసెన్స్ మరియు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తుంది. అమ్మకం ధర తయారీ తేదీ కాలపరిమితి వారంటీ, గ్యారెంటీ మొదలగు అనిత ప్రమాణాలను వినియోగదారులు తనిఖీ చేసుకొనుటకు ఉపయోగపడే బిఐఎస్ కేర్ యాప్ ఉపయోగం మొదలగు వివరాలతో కూడిన బ్రోచర్లను, నాగర్ కర్నూల్ వినియోగదారుల మండలి ఆర్గనైజర్ ప్రవీణ ఆధ్వర్యంలో నాగర్కర్నూల్ జిల్లా ఉన్నతాధికారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వినియోగదారుల మండలి సభ్యులు బంకల రవీందర్, ప్రవీణ, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

