క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
నమస్తే భారత్ సిద్దిపేట:
- ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్స్ మానుకొండి
- బెట్టింగ్స్ పెట్టి డబ్బులు నష్టపోయి జీవితాలను నాశనం చేసుకోకండి
- కోలుకోలేని విధంగా ఆర్ధిక నష్టం జరిగితే చివరకు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలు రోడ్డున పడతాయి. జాగ్రత్త
- పెద్దలకు సూచన: ఈ మ్యాచులు ప్రారంభం అయ్యాక మీ పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి
- పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడం గారు మాట్లాడుతూ* ప్రస్తుతం నడుస్తున్న ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ లో చాలామంది యువత ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడటం జరుగుతుంది. యువత బెట్టింగ్స్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. క్రికెట్ బెట్టింగ్స్ వల్ల యువత ఆర్థికంగా దెబ్బతిని చివరికి సూసైడ్ చేసుకొని ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని తెలిపారు. యువత ఆలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్ బెట్టింగ్ పై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లల పై ప్రవర్తన నిఘా ఏర్పాటు చేయాలని పిల్లలు ప్రతి రోజూ వారు చేస్తున్న పనుల గురించి ఆరా తీయాలని సూచించారు పిల్లలు యువకులు ఎక్కడికి వెళుతున్నారు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి క్రీకెట్ మ్యాచ్ ప్రారంభమైన తర్వాత పిల్లల్లో ఏదైనా మార్పు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. యువకులు క్రికెట్ బెట్టింగ్ మాయలో పడవద్దని జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు.క్రికెట్ బెట్టింగ్ పాల్పడం కూడా అత్యంత ప్రమాదకరం, నేరం అని వినోదం కొరకు ఆడే ఆటను వినోదముగానే చూడాలనీ, అంతే కాని ఇలాంటి వాటిలో ఇరుక్కొని యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. క్రికెట్ బెట్టింగ్, ప్లేయింగ్ కార్డ్స్, బెట్టింగ్ యాప్స్ పట్ల, అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా నిర్వహించిన, కార్యక్రమాలకు పాల్పడిన వెంటనే డయల్ 100 లేదా సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ మేడమ్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
