ఓటరు జాబితా రూపకల్పన,నవీకరణ కు రాజకీయ పార్టీలు సహకరించాలి.జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : ఓటరు జాబితా రూపకల్పన, నవీకరణకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఓటరు జాబితా పరిశుద్ధత చాలా ముఖ్యమైనదని, అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చూడాల్సిన బాధ్యత అందరిదీ అని ఆమె తెలిపారు.గత సంవత్సరం నవంబర్ నుండి ఈ నెల 20 వ తేదీ వరకు నూతన ఓటరు నమోదుకు నారాయణపేట నియోజకవర్గంలో ఫారం 6 ద్వారా 1294 దరఖాస్తులు రాగా 1068 విచారణ పూర్తి చేశారని, 48 పెండింగ్ ఉన్నాయని తెలిపారు. ఫారం 7 కు 169 రాగా 141విచారణ జరిగిందని 8 పెండింగ్ ఉన్నట్లు తెలిపారు. చిరునామా మార్పు కు 1529 దరకాస్తులు వచ్చాయని వాటిలో 1359 విచారణ పూర్తి కాగా 71 పెండింగ్ ఉన్నాయన్నారు. మిగతావి తిరస్కరణకు గురయ్యాయని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షా లోమ్ తెలిపారు. అలాగే మక్తల్ నియోజకవర్గంలో ఫారం 6 ద్వారా 1690 దరఖాస్తులు వచ్చాయని వాటిలో ఇప్పటి వరకు 1269విచారణ పూర్తి కాగా 147 పెండింగ్ ఉన్నట్లు తెలిపారు. ఫారం7 ద్వారా 332 దరఖాస్తులు రాగా,233 విచారణ పూర్తికాగా, 26 పెండింగ్ లో ఉన్నాయని, అలాగే చిరునామా మార్పు కోసం 1908 దరఖాస్తులు రాగా, 1625 విచారణ పూర్తికాగా, 156 పెండింగ్ లో ఉన్నాయని, మిగతావి తిరస్కరణకు గురయ్యాయని ఆయన వివరించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాభితా తయారుకు రిటర్నింగ్ అధికారి ప్రతి వారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు బూతు స్థాయి ఎజెంట్లను నియమించి జాభితా అందచేయాలని సూచించారు. ఫారం 7 ద్వారా నోటీస్ జారీ తదుపరి మాత్రమే ఓటు హక్కు తొలగించాలని, సుమోటో గా తొలగించడానికి అవకాశం లేదని తెలిపారు. అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చడం, రెండు ఓట్లున్న ఓటర్లను తొలగించే ప్రక్రియలో రాజకీయ పార్టీలు తమ కార్యకర్తల ద్వారా సరైన ఓటరు వివరాలను అందించేందుకు ముందుకు రావాలని, ఈ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా సహకరించాలని ఆయన కోరారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు కాబట్టి, ప్రతి అర్హుడు ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామచంద్రనాయక్, డిటీ బాల్ రాజ్,ఎన్నికల విభాగం పర్యవేక్షకులు అఖిల ప్రసన్న, రాణి దేవి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సుదర్శన్ రెడ్డి, పోషల్ వినోద్, సలీం, వెంకట్రాంరెడ్డి, అశోక్, అజయ్, వెoకటేశ్, తాహిర్ పాషా తదితరులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

