క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి 5 లక్షల ఎల్ ఓ సి అందజేసిన  వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి 5 లక్షల ఎల్ ఓ సి అందజేసిన   వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య

నమస్తే భారత్ :-వరంగల్  అపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సిఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండ, రెడ్డి కాలనీకి చెందిన యండి . నజీం అహ్మద్ కుమారుడు ఆదిల్ అహ్మద్ కు వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌లోని  MNJ క్యాన్సర్ హాస్పిటల్‌ లో చికిత్స నిమిత్తం సిఎంఆర్‌ఎఫ్ ద్వారా 5 లక్షల రూపాయల విలువైన ఎల్‌ఓసిని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మంజూరు చేయించారు. ఈ మేరకు సోమవారం హన్మకొండ, కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబానికి ఎల్‌ఓసి అనుమతి పత్రంను అందజేశారు. ఈ సందర్భంగా ఎల్‌ఓసిని మంజూరు చేయించిన ఎంపీ డా.కడియం కావ్యకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలోను బాలుడి పరిస్థితిని చూసి చలించిన ఎంపీ డా.కడియం కావ్య  కడియం ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితిని ఫోన్ ద్వారా వైద్యులను అడిగి తెలుసుకున్న ఎంపీ మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇదేం ఆట..! పెవిలియన్‌కు క్యూ కట్టిన సన్‌రైజర్స్‌ బ్యాటర్లు.. అసహనం వ్యక్తం చేసిన కావ్య మారన్‌..! ఇదేం ఆట..! పెవిలియన్‌కు క్యూ కట్టిన సన్‌రైజర్స్‌ బ్యాటర్లు.. అసహనం వ్యక్తం చేసిన కావ్య మారన్‌..!
ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం సొంత మైదానంలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లోనూ బ్యాట్స్‌మెన్‌ మరోసారి విఫలమయ్యారు. ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ,...
నిరుపేదల ఆత్మగౌరవ పథకమే సన్నబియ్యం : కలెక్టర్ సిక్తా పట్నాయక్
బ్రహ్మోత్సవాలకు మహామ్మాయిదేవి ముస్తాబు
మేడ్చల్‌లో యువతిపై లైంగికదాడికి యత్నించిన దుండగులు
రేవంత్ రెడ్డి వస్తున్నాడని పవన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు?
నేతకాని మహర్ రాష్ట్రస్థాయి సదస్సుకు మాల మహానాడు మద్దతు
మోదీని క‌లిసిన శ్రీలంక మాజీ క్రికెట‌ర్లు.. జ‌య‌సూర్య విజ్ఞ‌ప్తికి స్పందించిన ప్ర‌ధాని