అత్యాచారం కేసు.. పాస్టర్‌ బాజీందర్ సింగ్‌కు జీవితఖైదు

అత్యాచారం కేసు.. పాస్టర్‌ బాజీందర్ సింగ్‌కు జీవితఖైదు

అత్యాచారం కేసులో సెల్ఫ్‌ స్టైల్డ్‌ క్రిస్టియన్‌ పాస్టర్‌  బాజిందర్‌ సింగ్‌  పంజాబ్‌ కోర్టు  శిక్ష ఖరారు చేసింది. ఆయనకు జీవిత ఖైదు  విధిస్తూ ఇవాళ సంచలన తీర్పుయేసు యేసు ప్రాఫెట్‌ గా సింగ్‌ పాపులర్‌ అయ్యాడు. బాజిందర్‌ సింగ్‌ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు 2018లో పంజాబ్‌లోని జిరాక్‌పూర్‌ కు చెందిన ఓ మహిళ ఆరోపించింది. విదేశాలకు తీసుకెళ్తానని మాయమాటలు చెప్పి బాజిందర్‌ తనను శారీరకంగా వాడుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.దాంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు మొత్తం ఏడుగురిపై ఈ కేసులో అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసు విచారణ జరిపిన ట్రయల్‌ కోర్టు బాజిందర్‌ సింగ్‌ను నాలుగు రోజుల క్రితం దోషిగా తేల్చింది. కేసులో అభియోగాలు మోస్తున్న మిగతా ఆరుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇవాళ అతడికి శిక్ష ఖరారు చేసింది. బాజీందర్‌ సింగ్‌కు జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.కాగా బాజిందర్‌ సింగ్‌ తరచూ వివాదాల్లో ఉంటుంటాడు. ఇటీవల ఆయన తన కార్యాలయంలో ఓ మహిళపైన, మరో వ్యక్తిపైన దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. వారిని చెంపలపై కొట్టడం, చేతికి ఏది దొరికితే అది విసరడం లాంటి దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. 2022లో ఓ 22 మహిళ సింగ్‌ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. 2022లోనే అనారోగ్యంతో ఉన్న ఓ మహిళను బాగుచేస్తానని చెప్పి ఆమె కుటుంబం నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. కానీ ఆమె మరణించింది. వెలువరించింది.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మొదలుపెట్టని పూడికతీత పనులు.. మురికి కూపంగా మారిన నాలాలు.. డ్రైనేజీలు మొదలుపెట్టని పూడికతీత పనులు.. మురికి కూపంగా మారిన నాలాలు.. డ్రైనేజీలు
ఎల్బీనగర్‌, ఏప్రిల్‌ 8 : ఎల్బీనగర్‌ జోన్‌లో పూడికతీత పనులు ప్రారంభం కాలేదు. హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌ సర్కిళ్ల పరిధిలోని చాలా ప్రాంతాల్లో డ్రైన్లు, నాలాలు పూడుకుపోయాయి....
షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైన దుకాణాలను ప్రజాట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తా
మధిరలో పూర్తైన‌ వంద పడకల హాస్పిటల్‌ను ప్రారంభించాలి : ఏలూరి నాగేశ్వర్‌రావు
కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాలుగా రేషన్‌ దుకాణాలు : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
గర్భిణుల‌కు పోష‌కాహారం అందించాలి : సీడీపీఓ లక్ష్మి ప్రసన్న
వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ చ‌ట్టం అమ‌లుపై సీఎం మ‌మ‌త సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌
పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని సీపీఎం నిరసన