Category
ఖమ్మం
ఖమ్మం 

సంధ్యా సమయాన ముత్తారం రాములోరి కళ్యాణం

సంధ్యా సమయాన ముత్తారం రాములోరి కళ్యాణం ముదిగొండ, ఏప్రిల్ 6: వసంత రుతువు, చైత్రమాసం, నవమి (శ్రీరామ నవమి) అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఓ సందడి వాతావరణం ఆరోజున సీతారాముల కల్యాణాన్ని ఘనంగా తమ ఇంట్లో కళ్యాణంగా భావించి మండలం జరిపిస్తుంటారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని ముత్తారం గ్రామంలోనూ సీతారాముల కళ్యాణం ఘనంగా జరుగుతుంది. ఇక్కడ సంధ్యా సమయాన స్వామివార్ల కళ్యాణం...
Read More...
ఖమ్మం 

ఉపాధ్యాయ‌ సమస్యలఫై త్వ‌ర‌లోనే ప్రభుత్వంతో సంప్రదింపులు : య‌లమద్ది వెంకటేశ్వర్లు

ఉపాధ్యాయ‌ సమస్యలఫై త్వ‌ర‌లోనే ప్రభుత్వంతో సంప్రదింపులు : య‌లమద్ది వెంకటేశ్వర్లు బోనకల్లు, ఏప్రిల్ 05 : ఉపాధ్యాయుల సమస్యలపై తొందరలోనే ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తారని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు తెలిపారు. బోనకల్లులో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 7న శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు...
Read More...
ఖమ్మం 

రేషన్ షాపును ప్రారంభించాలి.. గిరిజన మహిళల నిరసన.. ఎమ్మార్వోకు వినతి

రేషన్ షాపును ప్రారంభించాలి.. గిరిజన మహిళల నిరసన.. ఎమ్మార్వోకు వినతి ఇల్లెందు : సీఎం కేసీఆర్ హయాంలో వేములవాడ గ్రామంలో కొత్త రేషన్ షాపును నిర్మించినా ప్రారంభించకపోవడంపై ఆదివాసి గిరిజన మహిళలు ధర్నా చేశారు. అనంతరం ఇల్లందు ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. ఇల్లెందు మండలం చల్ల సముద్రం గ్రామపంచాయతీ పరిధిలోని వేములవాడ గ్రామంలో రేషన్‌ షాపు లేదు. దాంతో అక్కడి ఆదివాసి గిరిజన మహిళలు రేషన్...
Read More...
ఖమ్మం 

భగవద్గీత కంఠస్థ పోటీల్లో మధిర వాసికి బంగారు పథకం

భగవద్గీత కంఠస్థ పోటీల్లో మధిర వాసికి బంగారు పథకం మధిర : మధిర పట్టణ వాసి అయిన అమరా చంద్రకళకు భగవద్గీత కంఠస్థ పోటీల్లో బంగారు పథకం లభించింది. మైసూరులో దత్తపీఠం వారు భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న అమరా చంద్రకళ తన ప్రతిభను చాటుకొని బంగారు పథకం సాధించారు. ఈ సందర్భంగా బంగారు చంద్రకళ మాట్లాడుతూ.. కృష్ణపరమాత్మ ఆశీస్సులతో బంగారు...
Read More...
ఖమ్మం 

బాబూ జగజ్జీవన్ రామ్ ఆదర్శప్రాయుడు : పీఆర్‌టీయూ

బాబూ జగజ్జీవన్ రామ్ ఆదర్శప్రాయుడు : పీఆర్‌టీయూ జగజ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5న బీహార్‌లో జన్మించి చిన్నతనం నుంచే ఆదర్శ భావాలతో నాయకత్వ లక్షణాలను పునికిపుచ్చుకున్నారని రంగారావు తెలిపారు. అంటరానితనానికి వ్యతిరేకంగా సమానత్వం కోసం పోరాడి జాతీయ ఉద్యమంలో పోరాడిన మహా యోధుడని చెప్పారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో భారత ఉప ప్రధానిగా, వ్యవసాయ, రక్షణ, కార్మిక, రైల్వే తదితర...
Read More...
ఖమ్మం 

వాయిదా చెల్లించడం లేదని.. గొర్రెలు జప్తు చేశారు..

వాయిదా చెల్లించడం లేదని.. గొర్రెలు జప్తు చేశారు.. ఖమ్మం: ఖమ్మం జిల్లాల డీసీసీబీ బ్యాంకు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బ్యాంకులో తీసుకున్న అప్పు వాయిదాలు సరిగా చెల్లించడం లేదంటూ ఓ రైతుకు చెందిన గొర్రెలను జప్తు చేశారు. మూడు రోజుల కింద జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూసుమంచి మండలం గోరీలపాడు తండాకు చెందిన బదావత్‌ లింగానాయక్‌.. మండల కేంద్రంలోని డీసీసీబీ బ్రాంచ్‌లో...
Read More...
ఖమ్మం 

మొక్కజొన్న కంకులు తిని చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి : ముద్దా భిక్షం

మొక్కజొన్న కంకులు తిని చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి : ముద్దా భిక్షం జూలూరుపాడు, ఏప్రిల్ 02 : భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధి వినోబానగర్ గ్రామంలో ఆడ మగ మొక్కజొన్న పంట వేసి కంకులు తిని చనిపోయిన జర్పుల కృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ (ఎంఎల్) మాస్‌లైన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ముద్దా భిక్షం డిమాండ్ చేశారు. బుధవారం వినోబానగర్ గ్రామంలో కృష్ణ...
Read More...
ఖమ్మం 

అక్రమ అరెస్టులతో పోరాటాలను ఆపలేరు

అక్రమ అరెస్టులతో పోరాటాలను ఆపలేరు మధిర, ఏప్రిల్ 01: అక్రమ అరెస్టులతో పోరాటాలను ఆపలేరని సీపీఎం మధిర డివిజన్ నాయకులు శీలం నరసింహారావు, పాపినేని రామ నరసయ్య అన్నారు. మంగళవారం స్థానిక పోలీసులు సీపీఎం నాయకులను అరెస్ట్ చేసి టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం వేయడం ప్రభుత్వం విరమించుకోవాలన్నారు....
Read More...
ఖమ్మం 

ఆక్రమణ గురైన స్మశాన వాటిక స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి : మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌

ఆక్రమణ గురైన స్మశాన వాటిక స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి : మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ మధిర, మార్చి 31 : ఖ‌మ్మం జిల్లా మ‌ధిర‌ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ మృత్యుంజయ సమీపంలో ఆక్రమణకు గురైన స్మశాన వాటిక స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హిందూ స్మశాన వాటికకు సంబంధించిన పది ఎకరాల్లో కొంత స్థలాన్ని ప‌లువురు వ్యక్తులు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారు. స్మశాన...
Read More...
ఖమ్మం 

వక్ఫ్‌ బిల్లుకు నిరసనగా.. నల్ల బ్యాడ్జీలతో ముస్లింల రంజాన్ ప్రార్థనలు

వక్ఫ్‌ బిల్లుకు నిరసనగా.. నల్ల బ్యాడ్జీలతో ముస్లింల రంజాన్ ప్రార్థనలు చండ్రుగొండ, మార్చి 31: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా రంజాన్‌ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి, ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా చండ్రుగొండ మండలంలో ఈద్గాల వద్ద నల్ల బ్యాడ్జీలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలు, వక్స్ బోర్డుకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో...
Read More...
ఖమ్మం 

అటవీ అధికారుల విధులకు ఆటంకం.. ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్‌

అటవీ అధికారుల విధులకు ఆటంకం.. ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్‌ టేకులపల్లి, మార్చి 28: ఇసుకను అక్రమంగా రవాణా చేసే అక్రమార్కుల ఆగడాలు రోజురోజుకీ ఎక్కువైతున్నాయి. ఫారెస్టు అధికారులపై దాడికి యత్నం చేసిన సంఘటన చంద్రు తండా సమీపన చోటు చేసుకుంది. కొత్తగూడెం జిల్లాటేకులపల్లి మండలం శంభుని గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ఫారెస్ట్ ఏరియాలో మొర్రేడు వాగు నుంచి ఐదు ట్రాక్టర్లతో ఇసుక అక్రమంగా తరలిస్తుండగా అదే...
Read More...
ఖమ్మం 

బిల్లు చెల్లింపులో ప్ర‌భుత్వ జాప్యం.. ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడి భార్య‌ మృతి

బిల్లు చెల్లింపులో ప్ర‌భుత్వ జాప్యం.. ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడి భార్య‌ మృతి పాల్వంచ, మార్చి 27 : ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాను దాచుకున్న జీపీఎఫ్ డబ్బులతో పాటు సంపాదిత సెలవుల డబ్బుల బిల్లులు సంవత్సరం నుంచి రాకపోవడం వల్ల చికిత్స చేయించ‌లేని స్థితిలో ఉపాధ్యాయుడి భార్య మృతిచెందింది. దీనిని నిరసిస్తూ ఉపాధ్యాయులు తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సంఘటన గురువారం పాల్వంచలో జ‌రిగింది. పాల్వంచ పట్టణంలోని...
Read More...