ePaper
Thursday, September 17, 2026
ePaper
Homeతెలంగాణతెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

📰 Generate e-Paper Clip

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

నమస్తే భారత్ :-తొర్రూరు

ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ డిమాండ్ చేశారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో బిజెపి అర్బన్ మండల అధ్యక్షుడు పైండ్ల రాజేష్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో బిజెపి పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర నాయకులు లేగా రామ్మోహన్ రెడ్డి తో కలిసి ఆయన వెంకటరమణ మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 కు ఎంతో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని, నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన సెప్టెంబర్ 17 ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంఐఎం పార్టీలకు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదని విమర్శించారు.రాబోయే రోజుల్లో బిజెపి అధికారంలోకి వచ్చి తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుందని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రంగు రాములు, పల్లె కుమార్,చింత సృజన్, ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొలుపుల శంకర్,అలిసేరి రవిబాబు, పూసల శ్రీమాన్,మండల అధ్యక్షులు గట్టు రాంబాబు, కటోజు భాస్కరాచారి, దేవరకొండ విష్ణువర్ధన్, నడిగడ్డ సందీప్,తూర్పాటి సాయి ముఖేష్, నూకల నవీన్, తూర్పాటి మోహిత్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!