ePaper
Wednesday, September 16, 2026
ePaper
Homeఎడిటోరియల్ఈనెల 19న నూతన కోర్టు భవనం ప్రారంభోత్సవం

ఈనెల 19న నూతన కోర్టు భవనం ప్రారంభోత్సవం

📰 Generate e-Paper Clip

ఈనెల 19న నూతన కోర్టు భవనం ప్రారంభోత్సవం

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో ఈనెల 19న ప్రారంభోత్సవం జరుపుకోనున్న నూతన కోర్టు భవనాన్ని మంగళవారం సీనియర్ సివిల్ జడ్జి, మహబూబాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ స్వాతి మురారితో కలిసి మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి పరిశీలించారు.నూతన కోర్టు భవనంలోని వివిధ విభాగాలను పరిశీలించి, ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, భద్రత తదితర అంశాలపై వారు సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ కృష్ణవేణి, సీఐ పవన్ కుమార్, ఎస్సై సతీష్, తొర్రూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరదాసు వెంకట రత్నం, మహబూబాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడాల సత్యనారాయణ, ఏజీపీ లింగాల శ్రీను, తొర్రూరు బార్ అసోసియేషన్ కార్యదర్శి తొనుకనూరి సైదులు, జై సిద్ధార్థ్, కొర్రా మున్నా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!