గణపతి ఆశీస్సులతో ప్రజలకు మెరుగైన అభివృద్ధి
నమస్తే భారత్ :-తొర్రూరు
ఇష్ట దైవం గణపతి ఆశీస్సులతో పాలకుర్తి నియోజకవర్గంలో అన్ని మండలాలను అభివృద్ధి చేస్తామని టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి తెలిపారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకునికి ఝాన్సీ రెడ్డి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ….పేదల కోసం ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు.గణపతి ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నారని కొనియాడారు. మట్టి గణపతితో పర్యావరణానికి మేలు చేకూరుతుందని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో నీటి కాలుష్యం జరుగుతుందన్నారు. ప్రజలు శాంతియుత వాతావరణం లో వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్,వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యురాలు పంజా కల్పన,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి రవీంద్ర చారి, పట్టణ అధ్యక్షుడు ముద్దసాని సురేష్ కౌన్సిలర్ జాటోత్ బద్రు నాయక్,నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, చిత్తలూరు శ్రీనివాస్, మంగళపల్లి రామచంద్రయ్య, జీనుగా సురేందర్ రెడ్డి, కందాడి అచ్చిరెడ్డి, జక్క మహబూబ్ రెడ్డి, పేరటి యాకుబ్ రెడ్డి, బిక్షం గౌడ్, కర్ర అశోక్ రెడ్డి, దొంగరి రేవతి శంకర్, శీను నాయక్, వెలుగు మహేశ్వరి,రమేష్ నాయక్, మహేష్ యాదవ్, ధర్మారపు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.



