మరిపెడలో అమృత్ పైపులైన్ పనుల పరిశీలన
మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని 4వ వార్డు పరిధిలో చేపట్టిన అమృత్ పైపులైన్ పనులను మంగళవారం మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పైపులైన్ పనులను నాణ్యతా ప్రమాణాలతో, వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
ప్రజలకు తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు చేపడుతున్న అమృత్ పైపులైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె పేర్కొన్నారు. పనుల సందర్భంగా రోడ్లు, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ మెరుగు రాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు అలువాల ఉపేందర్ ప్రజాపతి, సయ్యద్ సర్వర్ పాషా, గంధసిరి భిక్షపతి, భాషిత్ ఖాన్, గోరె మియా తదితరులు పాల్గొన్నారు



