రెండో విడత
ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి
అబ్బాయిపాలెం
ఇంటింటి సర్వేలో
-సిపిఐ (ఎం) మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్
నమస్తే భారత్ :-మరిపెడ
రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను వెంటనే మంజూరు చేయాలని ఇప్పటికే ఫస్ట్ విడుదల ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని సిపిఐ (ఎం) మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ అన్నారు. శుక్రవారం మండలంలోని అబ్బాయిపాలెం గ్రామంలో సిపిఐ (ఎం) ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ మరిపెడ మండలంలో 655 ఇండ్లు మొదటి విడతలు మంజూరు కాగా, అందులో 242 పూర్తిచేసుకున్నాయని తెలిపారు. మిగతా ఇండ్లు వివిధ దశలో నిర్మాణాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు పూర్తయిన 242 ఇండ్లకు వెంటనే బిల్లు పెండింగ్ లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అబ్బాయిపాలెం గ్రామంలో 120 మంది ఇల్లు లేని నిరుపేదలు ఇండ్ల కోసం ఆన్లైన్ చేసుకోగా అందులో మొదటి విడతలో 32 మంజూరైనట్లు అందులో ఒకటి రెండు మినహా మిగినే అన్ని నిర్మాణంలో ఉన్నాయని , ఇందులో సగం ఇల్లు పూర్తయినట్లు మధు వివరించారు. ఎల్ 3, ఎల్ 2, కేటగిరి లో ఉన్న ఇండ్లను అధికారులు పరిశీలించి వారందరికీ పెండింగ్ బిల్లులు మంజరైన చేయాలి, లేదా కొత్త ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేగాక ఈ గ్రామంలో నిరుపేదలు ఎక్కువమంది ఉన్నారని, ఉపాధి హామీ పథకంలో 12000 రూపాలు ఇస్తామని ప్రభుత్వం గత ఎన్నికల్లో హామీ ఇచ్చిందని, వెంటనే దానిని వర్తింపచేయాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ(ఎం) వార్డు సభ్యురాలు నందిపాటి ఉప్పలమ్మ వెంకన్న, నాయకులు లచ్చయ్య, కామిడ్ల వెంకన్న, జినక సైదులు, తదితరులు పాల్గొన్నారు.



