సీకేఎం లో కళాశాలలో
డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
వరంగల్ జూలై18 (నమస్తే భారత్ ) :
వరంగల్ లోని సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు స్పెషల్ ఫేస్ దోస్త్ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్
ప్రొఫెసర్ జీ. పోశయ్య తెలిపారు.ఈసందర్భంగా సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి పోశయ్య మాట్లాడుతూ 2026–27 విద్యా సంవత్సరం దోస్త్ ఆన్లైన్ అడ్మిషన్లకు బి ఏ, బీఎస్సీ, బీకాం మరియు ఏ ఈ డి పి ప్రోగ్రామ్స్ లో భాగంగా డైరీ అండ్ పౌల్ట్రీ మేనేజ్మెంట్ మరియు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కోసం టీఎస్ దోస్త్ ( డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ )పోర్టల్ ద్వారా స్పెషల్ ఫేస్ దరఖాస్తులు స్వీకరించబడుతున్నట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని
ఆన్‌లైన్ నమోదు (రిజిస్ట్రేషన్)
dost.cgg.gov.in లేదా దోస్త్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలని
ఆధార్-లింక్డ్ మొబైల్ నంబర్ ఉపయోగించి నమోదు చేసి, రుసుము చెల్లించాలి. స్పెషల్ ఫేస్ రుసుము అధికారిక నోటిఫికేషన్ ప్రకారం 400/-
ఆధార్ ధృవీకరణ
ఆధార్ బయోమెట్రిక్ ఓటిపి ద్వారా ధృవీకరణ పూర్తి చేయాలని
వెబ్ ఆప్షన్లు
నమోదు తర్వాత లాగిన్ అయ్యి సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ను ప్రథమ స్థానంలో ఎంచుకుని విద్యార్థులు ఇష్టపడే కోర్సుల (B.A., B.Sc., B.Com. డైరీ అండ్ పౌల్ట్రీ మేనేజ్మెంట్ మరియు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ మొదలైనవి వెబ్ ఆప్షన్లు నమోదు చేయాలి.మెరిట్, రిజర్వేషన్ వర్గం, అర్హతల ఆధారంగా సీట్లు కేటాయించబడతాయన్నారు. సీటు కేటాయించబడిన తర్వాత ఆన్‌లైన్ సెల్ఫ్-రిపోర్టింగ్ చేయాలి.
కళాశాలలో భౌతిక నివేదిక
సీట్ కేటాయించబడిన అభ్యర్థులు నిర్ణీత తేదీలలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు వచ్చి ఫీజు చెల్లించి ప్రవేశాన్ని ఖరారు చేసుకోవాలి అని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి పోశయ్య మరియు దోస్త్ కోఆర్డినేటర్ కెప్టెన్ డాక్టర్ పి సతీష్ కుమార్ తెలిపారు.
దోస్త్ అడ్మిషన్ కు అవసరమైన పత్రాలు:
ఇంటర్మీడియట్ మార్కుల మెమో,
10వ తరగతి మార్కుల మెమో,
ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, కండక్ట్ సర్టిఫికెట్,
కుల ధ్రువీకరణ పత్రం.
స్పెషల్ ఫేస్ కీలక తేదీలు
నమోదు 20-07-2026 నుండి 26-07-2026 చివరి తేదీ.
వెబ్ ఆప్షన్ల చివరి తేదీ:27-07-2026
సీట్ కేటాయింపు 30-07-2026
కళాశాలలో చివరి రిపోర్టింగ్ తేదీ: 31-07-2026 నుండి 01-08-2026
సంప్రదింపు వివరాలకు
కళాశాల ఫోన్ నంబర్ 9949553214,9390100634 లకు సంప్రదించాలని తెలియజేశారు.



