ప్రపంచ అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగ షాపూర్ నగర్ డివిజన్, రాజీవ్ గాంధీ నగర్ లోని గీతాంజలి హై స్కూల్ లో జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి హాజరైన ప్రపంచ మానవ హక్కుల సంస్థ జాతీయ డైరెక్టర్ మధుబాబు మాట్లాడుతూ,1998లో రోమ్ స్టాట్యూట్ ఆమోదం పొందిన రోజు కావడంతో ఈ తేదీ ప్రాధాన్యం ఉంది.ఈ ఒప్పందం ద్వారా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు స్థాపించబడింది.
ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధ నేరాలు, జాతి నిర్మూలన, మానవత్వానికి వ్యతిరేక నేరాలు జరిగినప్పుడు బాధితులకు న్యాయం అందించాలనే లక్ష్యంతో ఈ న్యాయస్థానం పనిచేస్తుంది.
ఈ సంవత్సరం సందేశం: “సరిహద్దులకు అతీతమైన న్యాయం – జవాబుదారీతనాన్ని బలోపేతం చేస్తూ, మానవ గౌరవాన్ని పరిరక్షిద్దాం.” అని చెప్పారు.. పాఠశాల కరెస్పాండంట్ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ,
“న్యాయం ఉన్నచోటే శాంతి ఉంటుంది; శాంతి ఉన్నచోటే అభివృద్ధి ఉంటుంది.”అని అన్నారు. కార్యక్రమంలో స్కిలోక్క్రాట్ వెబ్ట్రైక్స్ సందీప్ బల్లెం, చైతన్య కుమార్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.



