మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్
జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన భూక్య బాలు నాయక్
నమస్తే భారత్ :-మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటు పేద ప్రజలకు తనదైన శైలిలో తరచు పలు సేవా కార్యక్రమాలు చేపడుతు ప్రజా సేవ కొరకై తన జీవితాన్ని సైతం అంకితం చేసి అందరి మన్ననలు పొందుతున్న అందరి సుపరిచితులు క్రీడల పట్ల మక్కువతో క్రీడాకారులకు చైతన్యం చేస్తూ గ్రామీణ పేద క్రీడా కారులకు తగిన విధంగా ప్రోత్సాహం చేస్తూన్న మానుకోట ముద్దుబిడ్డ భూక్య బాలు.నాయక్.మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు.గా.ఎన్నికైనారు.మరియు జిల్లాలో కరాటే క్రీడాకారులకు విశేష సేవలు అందిస్తూ వారిని జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి వరకు తీర్చి దిద్దుతున్నందుకు జిల్లా జనరల్ సెక్రటరీ గా మహమ్మద్ అమీర్ పాషా, జిల్లా ట్రెజరర్ గా మంతపురం యాకస్వామి గారలను ఎన్నుకోవటం జరిగింది ఈ యొక్క ఎన్నిక తెలంగాణ స్పోర్ట్స్ కరాటే డు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ సామాజికవేత్త, ప్రపంచ శాంతి అవార్డు గ్రహీత, మహాత్మా గాంధీ జాతీయ శాంతి అవార్డు గ్రహీత, నేషనల్ యూనిటీ అవార్డు గ్రహీత, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డు గ్రహీత, మహాత్మ జ్యోతిరావు పూలే నేషనల్ ఫెలోషిప్ అవార్డు గ్రహీత, మదర్ తెరిసా మెమోరియల్ నేషనల్ అవార్డు గ్రహీత,లైఫ్ టైం గోల్డెన్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీత,
తెలంగాణ స్టేట్ సేవ రత్న అవార్డు గ్రహీత, బాలునాయక్ చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అందరివాడు భూక్య బాలు నాయక్.సేవలను గుర్తించి హైదరాబాబాద్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కార్యాలయంలో ఎన్నుకోవడం జరిగింది మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కరాటే అధ్యక్షునిగా నాయొక్క ఎన్నికకు సహకరించిన తెలంగాణ స్పోర్ట్స్ కరాటే డు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షలు మరియు పి.సి.సి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి మరియు తెలంగాణ స్పోర్ట్స్ కరాటే డు అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గానికి ప్రత్యేకంగా భూక్య బాలునాయక్ అభినందించారు.మరియు మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ జిల్లా కమిటీ అధ్యక్షులు భూక్య బాలు నాయక్, జిల్లా జనరల్ సెక్రటరి మహమ్మద్ అమీర్ పాషా, మంతపురం యాకస్వామి లు జిల్లా కమిటీకి ఎన్నికైన శుభాసందర్భంగా వారిని స్థానిక మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ లు మరియు వారి యొక్క బంధుమిత్రులు ప్రత్యేకంగా అభినందించి హర్షం వ్యక్తం చేశారు



