వాహనాల బహిరంగ వేలం
ఎక్సైజ్ సి ఐ ఆర్ నరేష్ రెడ్డి
నర్సంపేట ఆగస్టు 25(నమస్తే భారత్ ) :
వివిధ కేసుల్లో పట్టుబడిన ఉన్న వాహనాలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ నర్సంపేట సిఐ ఆర్ నరేష్ రెడ్డి తెలిపారు.
ఈ మేరకు ఆగస్టు 27, 2026 (గురువారం) నాడు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సమక్షంలో నర్సంపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌లో వాహనాల బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వేలం పాటలో పాల్గొనదలచిన ఆసక్తి ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డు జిరాక్స్ కాపీతో ఉదయం 9 గంటలకు నర్సంపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌కు హాజరు కావాలని అధికారులు సూచించారు. ఆసక్తి ఉన్న వారు నిర్ణీత సమయానికి హాజరై వేలం ప్రక్రియలో పాల్గొనాలని కోరారు.



