ePaper
Wednesday, August 26, 2026
ePaper
Homeఎడిటోరియల్పాపన్నపేట ఎఫ్ సి ఐ గోదాం ఇంచార్జి ఇష్టారాజ్యం... !గడువు ముగుస్తున్న రేషన్ డీలర్లకు పంపిణీ...

పాపన్నపేట ఎఫ్ సి ఐ గోదాం ఇంచార్జి ఇష్టారాజ్యం… !గడువు ముగుస్తున్న రేషన్ డీలర్లకు పంపిణీ చేయని పిడిఎస్ బియ్యం..

📰 Generate e-Paper Clip

*పాపన్నపేట ఎఫ్ సి ఐ గోదాం ఇంచార్జి ఇష్టారాజ్యం… !గడువు ముగుస్తున్న రేషన్ డీలర్లకు పంపిణీ చేయని పిడిఎస్ బియ్యం...!!

గ్రామాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రేషన్ డీలర్లు …!!!?* మెదక్,ఆగస్టు25: (నమస్తే భరత్)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలుపు రేషన్ కార్డులు కలిగిన లబ్ధిదారులకు ఆగస్టు,సెప్టెంబర్,అక్టోబర్ మూడు నెలల బియ్యాన్ని పంపిణీ చేయాలని రేషన్ డీలర్ లను ఆదేశించినప్పటికీ, అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఇప్పటి వరకు కొన్ని గ్రామాలకు చెందిన రేషన్ డీలర్లకు బియ్యం పంపిణీ కాక పోవటంతో రేషన్ కార్డు దారులు ఆకలితో అలమటిస్తున్నారు. పాపన్నపేట మండల కేంద్రంలో (ఏంఎల్ఎస్ పాయింట్)ఎఫ్ సి ఐ ఉంది.ఇక్కడి గోదాం నుండి పాపన్నపేట, టేక్మాల్ మండలాలకు చెందిన రేషన్ డీలర్లకు బియ్యం పంపిణీ జరుగుతుంది.కాగా మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీకి ప్రభుత్వం ఆగస్టు 31 తేదీ లోగా బియ్యం పంపిణీ చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారులు సూచించినప్పటికీ ఇక్కడ పని చేస్తున్న గోదాం ఇంచార్జి నరసింహ రావు మాత్రం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తూ, తమకు నచ్చిన గ్రామాలకు చెందిన రేషన్ డీలర్లకు బియ్యాన్ని సరఫరా చేస్తున్నారని కొందరు రేషన్ డీలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గడువు సమీపిస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో బియ్యాన్ని తమ షాపులకు పంపిణీ చేయకపోవటంతో తాము గ్రామాలలో రేషన్ కార్డు దారుల నుండి ఆగ్రహానికి గురవుతున్నారని డీలర్లు తెలిపారు.ఇదంతా ఒకవంతు కాగా,లారీలలో వచ్చిన బియ్యాన్ని గోదాం ఇంచార్జి బియ్యం బస్తాలను తూకం వేయకుండానే తమ తమ షాపులకు పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.దీనితో 50కిలోలు ఉండాల్సిన ఒక్కో బియ్యం బ్యాగులో ఓక కిలో నుండి రెండు కిలోల వరకు బియ్యం తక్కువగా వస్తున్నాయని డీలర్లు అవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులు స్పందించి రేషన్ డీలర్లకు సకాలంలో,బియ్యం తూకం వేసి పంపించాలని కోరుతున్నారు. ఈవిషయమై పాపన్నపేట గోదాం ఇంచార్జి నరసింహ రావు ను వివరణ కోరగా ఇందులో తమ పొరపాటు ఏం లేదని వివరణ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!