పారిశుద్ధ్య కార్మికులకు ప్రకాషన్న దీపావళి కానుక
కార్మికుల ముఖాల్లో చిరునవ్వులు పూయించిన దుస్తులు, స్వీట్ల పంపిణీ
దీపావళి పండుగను పురస్కరించుకొని గ్రేటర్ హైదరాబాద్ 123వ డివిజన్ హైదర్షాకోట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రకాషన్న ఆధ్వర్యంలో దుస్తులు, స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షులు శ్రీ పూలపల్లి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, తన చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు, స్వీట్లు అందజేశారు.
ఈ సందర్భంగా నల్లగొప్పుల హరీష్ గౌడ్ మాట్లాడుతూ.. నిత్యం ప్రజల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత కోసం ఎండనక, వాననక, దుమ్ము ధూళిని సైతం లెక్కచేయకుండా నిరంతరం శ్రమించే పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. సమాజ ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, వారి కష్టాన్ని గుర్తించి పండుగ వేళ గౌరవించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
పారిశుద్ధ్య కార్మికులు కూడా మన కుటుంబ సభ్యులేనని, వారి శ్రమను గుర్తించి గౌరవం, ఆత్మీయత అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. వారి జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలనే సదుద్దేశంతో ఈ చిన్న కానుకను అందజేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా పారిశుద్ధ్య కార్మికుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.
నమస్తే భారత్ | నవంబర్ 7 | గండిపేట మండల రిపోర్టర్: శ్రీనివాస్



