ePaper
Sunday, November 8, 2026
ePaper
Homeఎడిటోరియల్తొర్రూరు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం

తొర్రూరు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం

📰 Generate e-Paper Clip

తొర్రూరు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం

రూ.80 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

నమస్తే భారత్ :-తొర్రూరు

తొర్రూరు పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూరు పట్టణంలోని అన్ని వార్డుల్లో రూ.80 లక్షల ఎంజిఎఫ్ సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణ పనులకు శనివారం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.తొర్రూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రజలకు మెరుగైన రహదారులు, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్, తహసిల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి రవీంద్ర చారి,పట్టణ అధ్యక్షుడు ముద్దసాని సురేష్,వార్డు కౌన్సిలర్లు చాపల బాపు రెడ్డి, పెద్దగాని కళావతి సోమన్న,భద్రు నాయక్,బసనబోయిన ఐలమ్మ, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వెంకన్న యాదవ్,నాయకులు చిత్తలూరి శ్రీనివాస్ గౌడ్, మేకల కుమార్,జక్క మహబూబ్ రెడ్డి, జక్కుల రామ్ రెడ్డి, తాళ్ల పెల్లి రమేష్ గౌడ్,రాజేష్ యాదవ్, సురేందర్,మహేష్ యాదవ్, వెంకటరెడ్డి, వెలుగు మహేశ్వరి,దేవేందర్ నాయక్, రాంబాబు,అనిత, యశోద, రాణి, భవాని, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!