కేసముద్రం మండలం లో కాంగ్రెస్ నాయకుల కుటుంబాలకు ఎమ్మెల్యే మురళి నాయక్ పరామర్శ.
మాజీ ఎంపీటీసీ కందాల కృష్ణమూర్తి కుటుంబానికి అండగా ఉంటాం – మురళీ నాయక్ ఎమ్మెల్యే
ఉప్పరపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల వెంకటేశ్వర్లు కుటుంబానికి పరామర్ష
వెల్డింగ్ సలీం తడ్రి రంజాన్ దస్వా కు హాజరైన మురళీ నాయక్
నమస్తే భారత్ :-కేసముద్రం
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన వేం నరేందర్ రెడ్డి అనుచరుడు, మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కందాల కృష్ణమూర్తి అనారోగ్యం తో మరణించగా పార్టీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భుక్యా మురళి నాయక్ వారి గ్రామానికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి, వారి పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని, ఇలాంటి సమయంలో వారి కుటుంబానికి భగవంతుడు అండగా ఉండాలని కోరుకున్నారు..కాంగ్రెస్ కుటుంబాలకు నేను ఎప్పుడు అండగా ఉంటానని, ఏ కష్టం వచ్చినా నాకు తెలియజేయాలనీ వారి కుటుంబానికి వివరించారు..
అలాగే అదే గ్రామానికి చెందిన గ్రామ పార్టీ అధ్యక్షులు నూకల వెంకటేశ్వర్లు గారి తల్లి అనారోగ్యం తో ఉన్నదని తెలియగా వారి ఇంటికి వెళ్లి వెంకన్న తల్లి ని పరమార్శించి ఆరోగ్యం, యోగ క్షేమలు అడిగి తెలుసుకున్నారు.కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని వెల్డింగ్ సలీం తండ్రి రంజాన్ షేక్ మరణించగా వారి దస్వా (దశదిన ఖర్మ )లో పాల్గొని వారి పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని, వారి కుటుంబాన్ని పరమర్షించారు..
కేంద్రంలో పలువురిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఉప్పరపల్లి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కేసముద్రం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్, మాజీ మండల అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,బండారు దయాకర్,గ్రామ పార్టీ అధ్యక్షులు నూకల వెంకటేశ్వర్లు,పీసీసీ సభ్యులు దస్రు నాయక్,కౌన్సిలర్ వీరేష్ యాదవ్,ముదిగిరి సాంబయ్య,యువజన నాయకులు తండా శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరిగే విజేందర్, వార్డు సభ్యులు జనిగల అనిల్ కుమార్, భువనగిరి జ్యోతి, రమేష్, పలుస పద్మ, వెంకన్న, కంచ రాజ్ కుమార్, తండా సంపత్, బండారు దయాకర్, ఎటురోజు సత్యనారాయణ, మద్ది శ్రీనివాస్, నలగుర్తి ఉప్పలయ్య, మంద విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.



