ePaper
Tuesday, September 8, 2026
ePaper
Homeతెలంగాణదేశ్యా తండాలో వివాహ రిసెప్షన్‌కు హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి

దేశ్యా తండాలో వివాహ రిసెప్షన్‌కు హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి

📰 Generate e-Paper Clip

దేశ్యా తండాలో వివాహ రిసెప్షన్‌కు హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని 11వ వార్డు పరిధిలోని దేశ్యా తండాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాల్య నాయక్ మనుమరాలు శ్రీలత–వెంకటేష్‌ల వివాహ రిసెప్షన్ వేడుక ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ వివాహ రిసెప్షన్ వేడుకకు మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులు శ్రీలత–వెంకటేష్‌లను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు.
వివాహ వేడుకకు హాజరైన కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయులను ఆమె పలకరించారు. ఈ సందర్భంగా వధూవరుల కుటుంబ సభ్యులు చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికారు.
ఆమె వెంట అలువాల ఉపేందర్ ప్రజాపతి, గంధసిరి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!