ఏళ్ల కల సాకారం.. సెయింట్ ఆగస్టీన్స్ హైస్కూల్ గల్లీ రోడ్డుకు మహర్దశ
నమస్తే భారత్ :-మరిపెడ
గత నలభై సంవత్సరాలుగా అద్వానంగా ఉన్న సెయింట్ ఆగస్టీన్స్ హై స్కూల్ గల్లీ రోడ్డు సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. శిథిలావస్థలో ఉన్న ఈ రహదారి కారణంగా విద్యార్థులు, స్థానికులు, పట్టణవాసులు ఎన్నో ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు వర్షాకాలంలో ఈ బురద దారిలో రాకపోకలు సాగించడం నరక ప్రాయంగా ఉండేది.
ఈ దీర్ఘకాలిక సమస్యను గుర్తించిన డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్రు నాయక్ కృషితో 14వ వార్డు పరిధి లోని ఈ గల్లీలో నేడు సైడ్ డ్రైనేజి, తారు రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మున్సిపల్ కమిషనర్ కంచర్ల నరేష్ రెడ్డి తో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులను సోమవారం ప్రారంభించారు.
నాలుగు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రజల కల సాకారం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే విద్యార్థులతో పాటు ప్రజల రాకపోకలకు మరింత సౌకర్యం కలగనుంది.ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. అభివృద్ధి దిశగా మరో.ముందడుగు.కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ జాటోతు సురేష్,మెరుగు రాము,
కో ఆప్షన్ సభ్యుడు గుండగాని వెంకన్న,అలువాల ఉపేందర్ ప్రజాపతి.యాకయ్య, పడిదం రాధిక.అన్వేష్, లక్ష్మారెడ్డి, నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు



