మృతి చెందిన యువకుడి కుటుంబానికి మున్సిపల్ చైర్‌పర్సన్ పరామర్శ
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణానికి చెందిన మచ్చ మధుకర్ కుమారుడు మచ్చ సోమేశ్వర్ (20) ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి సోమవారం మచ్చ మధుకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా సోమేశ్వర్ చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. యువకుడి అకాల మరణం ఎంతో బాధాకరమని, చిన్న వయసులోనే నిండు జీవితాన్ని కోల్పోవడం కుటుంబానికి తీరని లోటని ఆమె పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ జాటోతు సురేష్, కో-ఆప్షన్ సభ్యుడు గుండగాని వెంకన్న, అలువాల ఉపేందర్ ప్రజాపతి, దూగుంట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు



