ePaper
Tuesday, September 8, 2026
ePaper
Homeతెలంగాణరోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు

నర్సంపేట సెప్టెంబర్ 7(నమస్తే భారత్ ) :
రోటరీ క్లబ్ నర్సంపేట వారి ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఖానాపురం మండలం ఎంపీపీ ఎస్ బుధరావుపేట యందు గురుపూజోత్సవ వేడుకలు “గురువుకు వందనం” అనే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల హెడ్మాస్టర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత జె. బద్రు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంప్లెక్స్ హెడ్మాస్టర్ భద్రయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోటరీ నర్సంపేట అధ్యక్షులు బొద్దిరెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ బుధరావుపేట పాఠశాల ఉపాధ్యాయులు సమిష్టి కృషితో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచడం గర్వించదగ్గ విషయం అని అభినందించారు. రోటరీ సెక్రెటరీ సిద్ధ సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా చాలా చక్కని వాతావరణంలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్ ని అభినందించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి పాఠశాలలకు మా ద్వారా కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సంవత్సరం ఉపాధ్యాయుల కృషితో అత్యధిక అడ్మిషన్లు నమోదు చేసి జిల్లా స్థాయిలోనే ముందంజలో ఉండడం విశేషమన్నారు. నిరుపేద విద్యార్థులకు చక్కని విద్యానందిస్తున్న ఉపాధ్యాయుల కృషిని రోటరీ సభ్యులు కొనియాడారు.ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ ను, కాంప్లెక్స్ హెడ్మాస్టర్, పాఠశాల ఉపాధ్యాయులను పూలమాలతో శాలువాలతో ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో రోటరీ బాధ్యులు తక్కలపల్లి నారాయణరావు , నామాల సత్యనారాయణ గారు, కొంతం నరేందర్ గారు, రాజశేఖర్, సాగర్ రావు, వంగ రాజేందర్ , ఉపాధ్యాయులు శ్రీ రామయ్య , రవీంద్ర చారి , పవన్ కుమార్ , రాజ్ కుమార్ , జగ్గయ్య , స్వర్ణలత , సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!