బోనాల వేడుకల్లో పాల్గొన్న మహమ్మద్ జాకీర్
అమ్మవారిని దర్శించుకున్న టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్
గణేష్‌నగర్‌లో ఘనంగా పల్లారం బండి, తొట్టెల ఊరేగింపు
కుత్బుల్లాపూర్, ఆగస్టు 10: ( నమస్తే భరత్ ); ఆషాఢ మాస బోనాల పండుగను పురస్కరించుకుని 284వ డివిజన్ పరిధిలోని గణేష్‌నగర్, అంబేద్కర్‌నగర్‌లో నిర్వహించిన పల్లారం బండి, తొట్టెల ఊరేగింపు కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో టీపీసీసీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్, డీసీసీ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి మొహమ్మద్ జాకీర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోనాల పండుగ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థించారు. కార్యక్రమంలో అంబేద్కర్‌నగర్ అధ్యక్షుడు దిలీప్ గౌడ్, విజయ్, గిరి, హరి, శ్రీకాంత్, సాయి, ఆలయ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.



