గ్రామ పంచాయతీ కారోబార్ కృష్ణ కుటుంబానికి అండగా ఉంటా…
రూ.2లక్షల ఆర్థిక సహాయం అందజేసిన
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
పాపన్నపేట, మండలం ఆగస్టు 11:(నమస్తే భరత్)
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పాపన్నపేట మేజర్ గ్రామ పంచాయతీ కారొభార్ ఆకుల కృష్ణ కుటుంబానికి తాను అపద సమయంలో అండగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు,మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. మంగళవారం కృష్ణ స్వగ్రామానికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు.ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుని,కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణ మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని,చిన్న వయసులోనే కుటుంబానికి దూరం కావడం బాధాకరమన్నారు.కృష్ణ కుటుంబం ఒంటరిది కాదని,కష్టకాలంలో వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. కుటుంబానికి ఈ సందర్భంగా రూ.2లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అవుట్ సోర్సింగ్ కింద ఉద్యోగంకల్పిస్తానని, ఎలాంటి అవసరం వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే,సహాయం చేసేందుకు ముందుంటానని భరోసా కల్పించారు.
కుటుంబ సభ్యులుమాజీ ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్, భాస్కర్ లకు ధైర్యం కోల్పోకుండా మనోధైర్యంతో ఉండాలని సూచించారు.కృష్ణ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ,ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
అనంతరం కుర్తివాడ మాజీ సర్పంచ్ రామాగౌడ్ ప్రమాదవ శాత్తూ ద్విచక్ర వాహనంపై నుండి కిందపడి వెన్నుముకపై బలమైన గాయాలు కావడంతో నడవలేని పరిస్థితి నెలకొందని తెలుసుకున్న అయన రామగౌడ్ సహోదరి ఇంటివద్ద ఉంటున్నారని తెలుసుకుని పరామర్శించారు.ఆరోగ్య స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు.అయన వెంట పాపన్నపేట సర్పంచ్ పావని నరేందర్ గౌడ్,మండల పార్టీ అధ్యక్షులు నరేందర్ గౌడ్,జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పి.ప్రభాకర్ రెడ్డి,సీనియర్ నాయకులు ప్రశాంత్ రెడ్డి,సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు వెంకటేశం,సర్పంచులు శ్రీధర్,శ్రీనివాస్,శేఖర్, శ్రీశైలం అప్ప,యాదగిరి, నాయకులు శ్రీకాంత్ అప్ప, నిట్టలాక్షప్ప,బాపురెడ్డి, దోసని సంగమేశ్వర, ముశెట్టి కిష్టయ్య,కుర్తివాడ ప్రసాద్ గౌడ్, సత్యనారాయణ, ఎండీ. ఖలీం, ఎండీ.అబెద్, సంతోష్ రెడ్డి,కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.



