NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 7:32 pm Posted by : NAMASTHE BHARAT

బోనాల వేడుకల్లో పాల్గొన్న మహమ్మద్ జాకీర్ అమ్మవారిని దర్శించుకున్న టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్

బోనాల వేడుకల్లో పాల్గొన్న మహమ్మద్ జాకీర్
అమ్మవారిని దర్శించుకున్న టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్

గణేష్‌నగర్‌లో ఘనంగా పల్లారం బండి, తొట్టెల ఊరేగింపు

కుత్బుల్లాపూర్, ఆగస్టు 10: ( నమస్తే భరత్ ); ఆషాఢ మాస బోనాల పండుగను పురస్కరించుకుని 284వ డివిజన్ పరిధిలోని గణేష్‌నగర్, అంబేద్కర్‌నగర్‌లో నిర్వహించిన పల్లారం బండి, తొట్టెల ఊరేగింపు కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో టీపీసీసీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్, డీసీసీ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి మొహమ్మద్ జాకీర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోనాల పండుగ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థించారు. కార్యక్రమంలో అంబేద్కర్‌నగర్ అధ్యక్షుడు దిలీప్ గౌడ్, విజయ్, గిరి, హరి, శ్రీకాంత్, సాయి, ఆలయ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.