ePaper
Tuesday, August 11, 2026
ePaper
Homeఎడిటోరియల్కత్తి వెంకట స్వామిని పరామర్శించిన గోపా నాయకులు

కత్తి వెంకట స్వామిని పరామర్శించిన గోపా నాయకులు

📰 Generate e-Paper Clip

కత్తి వెంకట స్వామిని పరామర్శించిన గోపా నాయకులు

నర్సంపేట ఆగష్టు11(నమస్తే భారత్ ) :
తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, ప్రొఫెసర్ డాక్టర్ కత్తి వెంకటస్వామి గౌడ్ సతీమణి భవాని ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.కాగా హైదరాబాద్ లోని వారి స్వగృహాం నందు నిర్వహించిన దశదిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గోపా అధ్యక్షులు బండి సాయన్న గౌడ్ , రాష్ట్ర గోపా ఆర్గనైజేషన్ కార్యదర్శి ఏలమకట్టి మీరయ్య గౌడ్ , వరంగల్ జిల్లా గోపా అసోసియేషన్ అధ్యక్షులు రామగోని సుధాకర్ గౌడ్ లతో మరికొందరు హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి యొక్క కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ రావ్ గౌడ్ , గౌడ సంఘం నాయకులు మొగుల్ల అశోక్ కుమార్ గౌడ్ , పల్లె రామచందర్ గౌడ్ , నర్సంపేట గౌడ సంఘం మాజీ అధ్యక్షులు గిరగానీ సాంబయ్య గౌడ్ , నాసగోని రాజయ్య గౌడ్ , గోపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!