ePaper
Wednesday, August 26, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎన్ సీసీ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి సీకేఎం కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పోశయ్య

ఎన్ సీసీ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి సీకేఎం కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పోశయ్య

📰 Generate e-Paper Clip

ఎన్ సీసీ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి

సీకేఎం కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పోశయ్య

వరంగల్ ఆగష్టు25(నమస్తే భారత్ ) :

 

డిగ్రీ విద్యార్థులు ఎన్ సీసీ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని సీకేఎం గవర్నమెంట్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పోశయ్య అన్నారు. మంగళవారం సి.కె.ఎం కళాశాల ఎన్ సీసి ఆర్మీ పదవ బెటాలియన్ ఆధ్వర్యంలో 2025-2026 ఎన్ సీసీ ప్రవేశాల ఎంపిక జరిగింది. ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పోశయ్య మాట్లాడుతూ ఎన్ సీసి లో చేరడం వలన దేశభక్తి, క్రమశిక్షణ పెంపోందుతుందన్నారు.తద్వారా ఉన్నత లక్ష్యాలను చేరడానికి ఎంతో దోహాదపడుతుందన్నారు. ఎన్ సీసీసి బి మరియు సి సర్టిఫికెట్స్ భవిష్యత్తులో ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు మరియు పై చదువులు చదువుకునే వారికి ఈ సర్టిఫికెట్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అందరూ ఎన్ సిసీలో చేరి మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని సూచించారు. ఎన్ సీసీ సర్టిఫికెట్స్ ద్వారా భారత ఆర్మీలో చేరి దేశ సేవ చేయడానికి,ఇతర అన్ని రంగాలకు సంబంధించినటువంటి పోటీ పరీక్షల్లో ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుందన్నారు. దాదాపు 105 మంది వరకు ఎన్ సీసీ సెలక్షన్ లో పాల్గోన్నారు. విద్యార్థులకు మొదట ఎత్తు, బరువు, రన్నింగ్, సెట్ అప్స్, పుష్అప్స్ మెడికల్ ఎగ్జామ్ నకు సంబంధించినటువంటివి మరియు రాత పరీక్ష ద్వారా ఎంపిక నిర్వహించారు.

ఈరోజు ఎన్ సిసి లో ఎంపికైనటువంటి బాయ్స్ మరియు గర్ల్స్ కు ప్రిన్సిపల్ పోశయ్య శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్నల్ ఎస్ఎస్ రామదురై, కెప్టెన్ డాక్టర్ పూజారి సతీష్ కుమార్, డాక్టర్ ఆయేషా, డాక్టర్ వరప్రసాద్, సూపరిండెంట్ శ్రీనివాస్, జె సి ఓ మారుతి, కమలాకర్, సీనియర్ క్యాడేట్స్ ఈశ్వర్, అఖిలాష్, అనూష, అక్షిత, తేజస్విని తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!