ePaper
Wednesday, August 26, 2026
ePaper
Homeఎడిటోరియల్శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి Rs.50,000/- రూపాయల విరాళం ఇచ్చి మొక్కు తీర్చుకున్న...

శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి Rs.50,000/- రూపాయల విరాళం ఇచ్చి మొక్కు తీర్చుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి,,

📰 Generate e-Paper Clip

శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి Rs.50,000/- రూపాయల విరాళం ఇచ్చి మొక్కు తీర్చుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి,,

నమస్తే భరత్,, 25/8/2026/ నారాయణపేట జిల్లా

మక్తల్ నియోజక వర్గం, ఉట్కూర్ మండలంలోని కొల్లూర్ గ్రామ దేవత అయినటువంటి శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో నూతనంగా నిర్మిస్తున్న రథానికి కొల్లూరు గ్రామ భక్తుల కోరికమేరకు గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా తన వంతు సహాయంగా ఈరోజు కొల్లూర్ గ్రామ దేవతను సందర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి Rs.50,000/- రూపాయల నగదును భక్తులకు అందజేసి మొక్కును చెల్లించుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు.

ఈ సందర్భముగా బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ దేవత ఆశీస్సులతో కేంద్రంలో శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరుగబోయే మంత్రి వర్గ విస్తరణలో భాగంగా మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డీకే అరుణమ్మ అక్క గారికి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించి ఆశీర్వదించాలని శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లిని కోరిన బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు.

ఇట్టి కార్యక్రమంలో కొల్లూరు గ్రామ సర్పంచ్ శ్రీమతి శశిరేఖా శ్రీనివాస్ గారు, మాజీ సర్పంచ్ శ్రీ సమృద్ధి గారు, శ్రీ శంకర్ రెడ్డి గారు, శ్రీ మహేందర్ రెడ్డి గారు, శ్రీ.టి.రాంరెడ్డి గారు,శ్రీ విజయ్ రామ్ గారు,శ్రీ వి.వెంకటేశ్వర్ రెడ్డి గారు,శ్రీ ఎం.రాంరెడ్డి గారు బీజేపీ భూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!