సుబ్లేడు ఆసుపత్రిలో వెంటనే వైద్యులను నియమించాలి
సిపిఐ(ఎంల్) న్యూడెమోక్రసీ డిమాండ్
తిరుమలాయపాలెం మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్
నమస్తే భారత్ :-ఖమ్మం
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో సుబ్లేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే వైద్యులు, సిబ్బందిని నియమించాలని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ డిమాండ్ చేశారు
ఆసుపత్రిలో వైద్యులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, DM&HO వెంటనే చర్యలు చేపట్టి బాధ్యత వహించాలని కోరారు. ప్రజలకు ఏదైనా హాని జరిగితే అందుకు వైద్య, ఆరోగ్య అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. విషజ్వరాల నివారణకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి, మందులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.



