సంక్షోభంలో భారతీయ వ్యవసాయ రంగం
తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నల్లపు సుధాకర్
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా కేంద్రంలో అఖిలభారత రైతు సంఘం జాతీయ మహాసభల సందర్భంగా, మండల రైతు సంగం మండల ఉపాధ్యక్షులు గుండగాని మధుసూదన్ అధ్యక్షతన 36 AIKS జెండాలను ఆవిష్కరించడం జరిగింది, ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ, భారతదేశ రంగం తీవ్ర ఆర్థిక సంక్షేమంలో ఉందని రైతులకి గిట్టుబాటు ధర లేదు, దేశంలో రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో పురుగు మందులు ఆకాశాన్ని అంటాయని, ఎరువుల బస్తాలు గత సంవత్సరం కన్నా ఇప్పుడు ఒక బస్తాకు 550 నుంచి 600 రూపాయలు కేంద్ర ప్రభుత్వం రైతు మెడ మీద వేసిందని తెలియజేశారు, భారతదేశంలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా బడా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ విద్యుత్ చట్టాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు, గత రెండు సంవత్సరాల కింద, దేశంలోని అనేక ప్రాంతాల నుంచి రైతులు AIKS అధ్యక్షతన 13 నెలల రైతు ఉద్యమం చేపట్టి దాదాపు 75 మంది రైతులు చనిపోయిన ఉద్యమాన్ని ఆపకుండా నిర్వహించి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రైతుల మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవడం జరిగిందని వివరించారు, తక్షణమే కపాస్ కిసాన్ యాప్ ని రద్దు చేయాలని రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన, పత్తికి కనీసం మద్దతు ధర 12 వేల రూపాయల ప్రకటించాలని ప్రభుత్వమే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) డిమాండ్ చేశారు, వారికి మద్దతు ధర ప్రకటించాలని తక్షణమే బియ్యం 10000 రూపాయల నోకింటాని, తగ్గించాలని డిమాండ్ చేశారు, అదేవిధంగా రైతుల సాగుకు తాగునీరు అందించి, నిరంతరాయంగా 24 గంటలు కరెంటు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతుబంధును విడుదల చేయాలని, ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల ఉపాధ్యక్షులు గుండ గాని మధుసూదన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న, మండల నాయకులు పల్లి శ్రీనివాస్ రెడ్డి, నలబోలు లక్ష్మారెడ్డి, బయ్య సురేష్ ఆవాసం మండల బాధ్యులు Sk షరీఫ్, మండల జీఎంపీస్ సంఘ నాయకులు బింగి మహేష్, కేజీకేస్ మండల నాయకులు గంధసిరి మహేష్, AIKS నాయకులు భూక్య చంద్రనాయక్, శారద, బానోత్ శాంతి, మండల నాయకులు దొంతు సోమన్న, తదితరులు పాల్గొన్నారు



