ePaper
Sunday, November 8, 2026
ePaper
Homeతెలంగాణజీ రామ్ జీ పథకంపై మేట్ లకు శిక్షణ, నమోదు కార్యక్రమం

జీ రామ్ జీ పథకంపై మేట్ లకు శిక్షణ, నమోదు కార్యక్రమం

📰 Generate e-Paper Clip

జీ రామ్ జీ పథకంపై మేట్ లకు శిక్షణ, నమోదు కార్యక్రమం

ఖానాపురం నవంబర్ 7( మల్లేష్ నమస్తే భారత్ ) :
ఖానాపురం మండల కేంద్రంలోని రైతు వేదికలో
వికసిత్ భారత్ – గ్రామీణ ఉపాధి మరియు జీవనోపాధి హామీ (జీ రామ్ జీ)
పథకంలో భాగంగా మేట్ లకు శిక్షణ, నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మేట్ లకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో శిక్షణ అందించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ వి. అద్వైత, ఏపీఓ కె. సునీత, ఈసీ అరుణ్ కుమార్, సాంకేతిక సహాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ అద్వైత మాట్లాడుతూ, గ్రామాల్లో కూలీలను పనులకు తీసుకురావడంలో మేటీలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. గ్రామ ప్రజలతో సమన్వయం చేసుకుంటూ కూలీలు పనుల్లో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించాలని తెలిపారు. స్మార్ట్‌ఫోన్ వినియోగంపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ఎన్ ఎమ్ ఎమ్ ఎస్ యాప్ ద్వారా హాజరు నమోదు చేసే విధానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.
అలాగే కూలీలకు పనుల కొలతల ఆధారంగా పని చేసే విధానాన్ని వివరించి, నాణ్యతతో కూడిన పనులు చేపట్టేలా మార్గనిర్దేశం చేయాలని సూచించారు. మేటీల సమన్వయం, చొరవ, కృషితో కూలీల పనితీరును మెరుగుపరిచి, రోజువారీ వేతనాన్ని గరిష్ఠంగా రూ.308 వరకు పొందేలా కృషి చేయాలని ఎంపీడీఓ పిలుపునిచ్చారు.
గ్రామీణ ఉపాధి పనుల నిర్వహణలో మేటీలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, కూలీలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!